త్రిపురాంతకం
శ్రీ శైల క్షేత్రానికి తూర్పు ద్వారమైన 'త్రిపురాంతకం'లో శివుడు ... త్రిపురాంతకుడిగా, పార్వతీ దేవి ... త్రిపురసుందరీదేవిగా భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి కుమారగిరి కింది భాగంలో చెరువు ... దాని మధ్యలో కదంబవృక్షాల మధ్య వెలసిన అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. తారకాసుర సంహారం అనంతరం కుమారస్వామి ఇక్కడే సేదతీరాడుగనుక ఈ కొండకు 'కుమార గిరి' అనే పేరు వచ్చింది. త్రిపురాసుర సంహారం తరువాత ఈ ప్రదేశం త్రిపురాంతకంగా పిలవబడింది. అలాంటి ఈ క్షేత్రాన్ని ఇంద్రుడు సదా పర్యవేక్షిస్తూ ఉంటాడని అంటారు.
గర్భాలయంలోని మూలమూర్తి కొన్ని వేల సంవత్సరాలనాటిదని చెబుతారు. ఇది తపో సంపన్నులకు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. గర్భాలయానికి ద్వారపాలకులుగా భద్రుడు - అనుభద్రుడు కనిపిస్తారు. ఆ తరువాత 12- 13 శతాబ్దాల కాలంలో గణపతి దేవుడి చెల్లెలు 'మైలాంబ' ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసినట్టు ఆధారాలు వున్నాయి. అమ్మవారు రౌద్రమూర్తిగా కనిపించడమే కాకుండా, ఇక్కడ గతంలో జంతుబలులు విపరీతంగా జరిగేవనడానికి నిదర్శనాలు వున్నాయి. విశేషమైనటువంటి పుణ్య దినాల్లో అమ్మవారు పులి ... సింహ ... గజ ... అశ్వ ... శేష ... నెమలి వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తుంటుంది.
ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన పరివారదేవతలు కొందరు దుండగుల దాడుల వలన భిన్నమై కనిపిస్తారు. ఈ క్షేత్రంలో వందకు పైగా శిలా శాసనాలు కనిపిస్తాయి. అయ్యవారికి ... అమ్మవారికి సంబంధించిన వివిధ సేవలకుగాను దాతలు సమర్పించిన వాటి వివరాలు ఈ దాన శాసనాల్లో కనిపిస్తుంటాయి. ఇక ఇక్కడి స్వామివారు మహా సత్యవంతుడని చెబుతారు. పూర్వం ఈ ఆలయం దగ్గర ఒకవ్యక్తి ఒక మూగజీవిని రక్షించడం కోసం మరో వ్యక్తిని హత్య చేశాడు. అయితే అతని మాటలను ఆ గ్రామస్థులు నమ్మలేదు. అతను చెబుతున్నది నిజమేనంటూ స్వామివారి గర్భాలయం నుంచి వినిపించిందట. అందువల ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భావించి భక్తులు విశేష సంఖ్యలో పూజించి తరిస్తుంటారు.