శివలింగారాధన ఫలితం!
పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించి, భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. శివలింగారాధన వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. బంగారం .. వెండి వంటి లోహపదార్థాలతో తయారు చేయబడిన శివలింగాలను, బాణలింగం .. స్పటిక లింగం వంటి వాటితో రూపొందించబడిన శివలింగాలను పూజించడంవలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
మట్టితోను .. వెన్నతోను .. పిండితోను ఇలా వివిధ రకాల పదార్థాలతో తయారుచేయబడిన శివలింగాలను ఆరాధించడం వలన, పుణ్యరాశి పెరుగుతుంది. మనసులోని కోరికలను బట్టి ఆయా శివలింగ రూపాలను పూజించవలసి వుంటుంది. సాధారణంగా చాలామంది ఆరోగ్యాన్ని .. ఐశ్వర్యాన్ని కోరుకోవడం జరుగుతూ వుంటుంది. ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి ఐశ్వర్యం .. ఆరోగ్యం రెండూ అవసరమే. అందువలన వాటిని కోరుకోవడం జరుగుతూ వుంటుంది.
'పటిక బెల్లం'తో తయారు చేయబడిన శివలింగాన్ని పూజించడం వలన, ఆరోగ్యం కలుగుతుందని చెప్పబడుతోంది. ఇక ఐశ్వర్యాన్ని కోరుకునేవారు 'కపిల గోవు' పేడతో చేసిన శివలింగాన్ని ఆరాధించవలసి ఉంటుంది. అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ శివలింగాలను పూజించడం వలన, ఆశించిన ఫలితం తప్పక లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.