వివాహ ఘట్టాలు
భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది. నూతన వధూవరుల జీవితాలను దృష్టిలో పెట్టుకుని మన పూర్వీకులు ఎన్నో అంశాలను సంస్కృతీ సంప్రదాయాలుగా వివాహ సందర్భంలో చేర్చారు. ఆచార వ్యవహారాల విషయంలో కొద్ది మార్పులు ఉన్నప్పటికీ, మొత్తంగా చోటుచేసుకునే వివాహ ఘట్టాలుగా 'స్నాతకం' మొదలు 'సత్యనారాయణ స్వామి వ్రతం' వరకూ అనేక అంశాలు కనిపిస్తాయి. 'పెళ్లి చూపులు' కార్యక్రమంలో అమ్మాయి - అబ్బాయి ఒకరినొకరు నచ్చుకోవడం, 'నిశ్చయ తాంబూలాలు' కార్యక్రమంలో రెండు కుటుంబాల వారు 'మా అబ్బాయి - మా అమ్మాయి' అనిపించుకోవడం జరుగుతుంది.
ఇక నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం జరిగే వివాహ మహోత్సవంలో స్నాతక వ్రతం ... కాశీ యాత్ర ... వరపూజ ... గౌరీపూజ ... మంగళ స్నానాలు ... కన్యావరణం ... మథుపర్కాలు ... యజ్ఞోపవీత ధారణ ... మహాసంకల్పం ... కాళ్లు కడగడం ... జీలకర్ర -బెల్లం ... కాళ్లు తొక్కించడం ... కన్యాదానం ... స్వర్ణ జలాభి మంత్రణం ... మంగళ సూత్ర ధారణ ... తలంబ్రాలు ... బ్రహ్మముడి ... ఉంగరాలు తీయడం ... సప్తపది ... ప్రధాన హోమం ... సన్నికల్లు తొక్కడం ... లాజహోమం ... స్థాలీపాకం ... నాగవల్లి ... సదస్యం ... నల్లపూసలు కట్టడం ... అరుంధతిని చూపడం ... అప్పగింతలు ... గృహప్రవేశం ... సత్యనారాయణ వ్రతం వంటి ఘట్టాలు చోటుచేసుకుంటాయి. ఇందులోని ప్రతి అంశం కూడా దాంపత్య జీవితంలోని అర్థాలను ... పరమార్థాలను తెలియజేస్తూ వుండటం విశేషం.