కృష్ణాష్టమి రోజున భాగవత పారాయణ
అవతార పురుషుడుగా .. శ్రీకృష్ణుడు జన్మించినది శ్రావణ బహుళ అష్టమి రోజున. అందువలన ఈ రోజుని కృష్ణాష్టమిగా .. జన్మాష్టమిగా భావిస్తుంటారు. దుష్టులను శిక్షిస్తూ .. శిష్టులను రక్షిస్తూ .. ధర్మసంస్థాపన చేయడానికి శ్రీకృష్ణుడు అవతరించాడు. లోక కల్యాణం కోసం ఆయన చూపిన మహిమలు అన్నీ ఇన్నీ కావు.
ఈ రోజున పగలంతా ఉపవాసం ఉండి .. సాయంత్రం వేళ శ్రీకృష్ణుడిని షోడశ ఉపచారాలతో సేవించాలి. అయిదు వత్తులతో .. కొబ్బరినూనెతో దీపారాధన చేయవలసి ఉంటుంది. కదంబ పూలతో స్వామిని పూజించి, పాలు .. పెరుగు .. వెన్న .. మీగడలను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. భాగవత పారాయణతో జాగరణ చేయాలి.
ఈ రోజున కృష్ణాలయాన్ని దర్శించుకుని .. ఆయన లీలావిశేషాలను తలచుకున్నా చాలని చెప్పబడుతోంది. ఇలా కృష్ణుడి పుట్టినరోజుని ఒక పండుగలా జరుపుకుని .. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయనని పూజించడం వలన కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడి ఆరాధన వలన సమస్త పాపాలు నశించి .. సకల శుభాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.