వాస్తుపురుషుడి ఆలయం
జీవితంలో ఒకదాని తరువాత ఒకటిగా సమస్యలు ఎదురవుతూ వున్నప్పుడు .. తరచూ అనారోగ్యాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు .. ఆర్ధికపరమైన నష్టాలను ఎదుర్కుంటున్నప్పుడు సహజంగానే తాము నివసిస్తోన్న గృహం వాస్తు సరిగ్గాలేదేమోననే సందేహం కలుగుతూ వుంటుంది. దాంతో వాస్తు తెలిసిన వ్యక్తిని పిలిచి వాస్తుపరమైన దోషాలను గురించి తెలుసుకుని ఆ సూచనలను పాటిస్తుంటారు.
జీవితాన్ని ఇంతగా ప్రభావితంచేసే వాస్తుపురుషుడికి ఆలయం ఉండటమనేది చాలా అరుదు. భక్తులకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తూ ఒకచోట వాస్తుపురుషుడి ఆలయం దర్శనమిస్తుంది. తమిళనాడు - వేలూరు జిల్లా పరిధిలోని 'కీల్ పుదుపేట' లో ఈ ఆలయం నిర్మించబడి వుంది. ధన్వంతరీ కొలువుదీరిన ఆలయ ప్రాంగణంలోనే వాస్తుపురుషుడి ఆలయం కనిపిస్తుంది.
ఇక్కడి వాస్తుపురుషుడి దర్శనం చేసుకోవడం వలన, వాస్తు సంబంధమైన దోషాల ప్రభావం అంతగా ఉండదని భక్తులు భావిస్తుంటారు. ఆయనని దర్శించుకోవడం వలన వాస్తు సంబంధమైన దోషం ఎక్కడ ఉందనేది తెలిసి, దానిని సరిచేసుకునే అవకాశం కలుగుతుందని విశ్వసిస్తుంటారు. సంతోషకరమైన జీవితానికి వాస్తు ఎంతగానో దోహదంచేస్తూ ఉంటుంది కనుక, ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.
ఒక వైపున ధన్వంతరీ ఆలయం కూడా ఉండటంతో, ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన ఇటు ఆరోగ్య సంబంధమైన సమస్యలు .. అటు వాస్తు సంబంధమైన దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం మనసుకి ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.