కోరికలు నెరవేర్చే కోటప్పకొండ
ఆంధ్ర రాష్ట్రంలో 'కోటప్పకొండ' తిరునాళ్లకు ఎంతో ప్రత్యేకత వుంది. గుంటూరు జిల్లాలోని కోటప్పకొండలో వెలసిన ఈ క్షేత్రంలో రుద్రుడుతో పాటు బ్రహ్మ ... విష్ణువు ... పేర్లతో వరుసగా కొండ శిఖరాలు కనిపిస్తాయి. ఈ కారణంగా ఈ క్షేత్రానికి త్రికూటేశ్వరమనీ ... త్రికూటాద్రి అనే పేర్లు వచ్చాయి. శివుడు ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణాన్ని స్థల పురాణం తెలియజేస్తుంది. పూర్వం శివుడు సతీదేవి వియోగం అనంతరం ఈ కొండ ప్రదేశంలోనే ధ్యాన నిమగ్నుడయ్యాడట. ఆ సమయంలో ఆయనకి 'ఆనందవల్లి' అనే ఓ గొల్లభామ పాలను - తేనెను సమర్పిస్తూ... సేవలు చేస్తూ వుండేది. అలాగే శాలంకయ్య అనే రైతు కూడా స్వామి అక్కడ ఉండటాన్ని గమనించి సేవించసాగాడు.
ఇలా కొంతకాలం గడిచాక స్వామివారిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు శాలంకయ్య. అందుకు స్వామి అంగీకరించడంతో అతను అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎదురు చూడసాగాడు. ఇక గర్భవతి అయిన గొల్లభామ ... స్వామి దగ్గరికి వచ్చి తాను కొండ ఎక్కలేనని తనకోసం కొండ దిగువకు రమ్మని కోరింది. అందుకు సిద్ధపడిన శివుడు వెనుతిరిగి చూడకుండా ఆమెను నడవమని చెప్పాడు. ఆమె అలా కొన్ని అడుగులు వేసిన అనంతరం తాను కూర్చున్న చోటు నుంచి శివుడు పైకి లేచాడు. దాంతో ఒక్కసారిగా ఆ కొండ కంపించింది. భయంతో ఒక్కసారిగా గొల్లభామ వెనుదిరిగి చూసింది. అంతే శివుడు అక్కడే లింగాకారంలోకి మారిపోయాడు. ఆ గొల్లభామ కూడా అక్కడే శిలగా మారిపోయింది.
సరిగ్గా ఆసమయంలోనే అక్కడికి వచ్చిన శాలంకయ్య, కన్నీళ్ల పర్యంతం కాగా, ఆ క్షేత్రానికి 'కోటి ప్రభలు' వచ్చిన రోజున తాను కొండదిగి వస్తానని శివలింగం నుంచి మాటలు వినిపించాయి. ఈ విషయాన్ని శాలంకయ్య ప్రచారం చేయడంతో శివుడి దగ్గరకి ప్రభలు కట్టుకుని రావడం ఆచారంగా మారిపోయింది. కాలక్రమంలో శాలంకయ్య ఇటు స్వామివారికి ... అటు గొల్లభామకి ఆలయాలు నిర్మించాడు. ప్రధాన మంటపంలో శివయ్య ఎదురుగా నందీశ్వరుడు ... ఓ వైపున వినాయకుడు ... మరో వైపున కుమారస్వామి కొలువుదీరి కనిపిస్తారు. ఇక్కడి దైవానుగ్రహం కారణంగా సంతానాన్ని పొందిన వారు ... ఆ పిల్లలను ధ్వజ స్తంభానికి కట్టి తమ మొక్కుబళ్లు చెల్లించుకుంటూ ఉంటారు. శివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఇక్కడ వన సమారాధనలు విశేషంగా జరుగుతాయి.