దీర్ఘాయువు

దీర్ఘాయువు
ఎంతటి విద్య ... మరెంతటి సంపద వున్నా, ఆ పేరు ప్రతిష్ఠలు చూసుకోవడానికి ... ఆ సంపదను అనుభవించడానికి ఆరోగ్యం - ఆయుష్షు వుండాలి. కాబట్టి దైవం ఎదురుగా కనబడితే చాలు అందరూ కోరుకునేవి ఈ రెండే. బలవర్ధకమైన పోషక పదార్థాలను ఆహారంగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునేమోగాని, ఆయుష్షు అనేది ఎవరి చేతుల్లోను వుండదు. అయితే దీర్ఘాయువును పొందడం కోసం అగస్త్య మహర్షి చెప్పిన కొన్ని విషయాలను పాటించి చూడవచ్చు.

సంధ్యా సమయంలో ఉత్తర ముఖంగా గానీ ... పశ్చిమ ముఖంగా గాని పడుకోకూడదనీ, సూర్య చంద్రుల ... నక్షత్రముల రాకను చూడకూడదని అగస్త్య మహర్షి చెప్పాడు. నిలబడి దోసిలితో నీళ్లు తాగకూడదనీ, పాదాలు ... చేతులు తడిగా ఉండగానే భోజనం చేయాలని పేర్కొన్నాడు. ఈ నియమాలు పాటించడం వలన దీర్ఘాయువును పొందవచ్చని ఆయన సూచించాడు. మహర్షులలో అగస్త్యుడికి గల స్థానం ... ఆయన శాస్త్ర పరిజ్ఞానం గురించి తెలిసిన వారు తప్పక ఈ నియమాలను పాటిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles