సుముహూర్తం

సుముహూర్తం
సాధారణంగా ఎవరు ఏ శుభ కార్యాన్ని ప్రారంభించాలన్నా అందుకు తగిన మంచి ముహూర్తాన్ని చూస్తుంటారు. ఆ ముహూర్త బలంపైనే ఆ శుభకార్యం యొక్క ఫలితం ఆధారపడి వుంటుందని విశ్వసిస్తుంటారు. అందువలన ఈ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ముహూర్తం చూడాలంటే ఆయా వ్యక్తులకు సంబంధించిన రాశులు ... గ్రహాల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పంచాంగములనబడే తిథి .. వార .. నక్షత్ర .. కరణ .. యోగములను పరిశీలిస్తారు.

ముహూర్తమంటే 'మంచి సమయం' అంతేగా అని చాలామంది ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటూ వుంటారు. నిజానికి 21 దోషములు తగలకుండగా ముహూర్తాన్ని నిర్ణయించవలసి వుంటుంది. ఇంకొందరు లగ్నం ... ముహూర్తం రెండూ ఒకటేనని అనుకుంటూ వుంటారు. నవగ్రహాల స్థితి గతులనుబట్టి నిర్ణీత లగ్నము శుభప్రదంగా ఉందా ... లేదా అనేది చూస్తారు. లగ్న సమయం 2 గంటల కాలముంటే ... ముహూర్త కాలం కేవలం 48 నిమిషాలు మాత్రమే వుంటుంది. లగ్న కాలమందు శుభ ముహూర్తముండు కాలమునే సుముహూర్తమని అంటారు.

More Bhakti Articles