వాయులింగం

వాయులింగం
కంచిలో 'పృథ్వీ లింగం' ... చిదంబరంలో 'ఆకాశలింగం' ... జంబుకేశ్వరంలో 'జలలింగం' ... తిరువణ్నామలై లో 'తేజోలింగం' ... శ్రీ కాళహస్తిలో 'వాయులింగం' పంచభూత లింగాలుగా చెప్పబడ్డాయి. ఈ పంచభూత లింగాలు ఎంతో విశిష్టమైనవిగా ... మరెంతో మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి.

సాధారణంగా ఏ దేవాలయంలోను గర్భాలయంలోకి గాలి రావడానికి అవకాశముండదు. ఆగమ శాస్త్రం మేరకు గర్భగుడి నిర్మాణాన్ని అలాగే చేస్తారు. అందువల్లనే శ్రీ కాళహస్తీశ్వర స్వామి గర్భాలయంలోకి కూడా ఏ మాత్రం గాలి రాదు.

అయితే స్వామి వారికి ఇరువైపులా వున్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ వుంటుంది. ఈ రెండు దీపాలు స్వామివారి నాశికా భాగానికి సమాన దూరంలో వుంటాయి. దాంతో స్వామి వారి శ్వాస కారణంగానే అలా జరుగుతుందనే విషయం స్పష్టమైంది. అందువలన ఇక్కడి శివలింగం వాయులింగంగా ప్రసిద్ధికెక్కింది. ఈ కారణంగానే ఇక్కడి స్వామివారిని దర్శిస్తే పరమశివుడిని ప్రత్యక్షంగా దర్శించిన ఫలితం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles