కృతయుగం నాటి అయినవిల్లి
అతి ప్రాచీనమైన స్వయంభువు వినాయక క్షేత్రాలలో దక్షిణాంధ్రకి చెందిన 'కాణిపాకం' ... ఉత్తరాంధ్రకి చెందిన 'అయినవిల్లి' కనిపిస్తాయి. అయినవిల్లి వినాయకుడు ఆలయ సముదాయంలో కొలువుదీరి కనిపిస్తున్నప్పటికీ, కృతయుగం నాటికే ఇది తన ఉనికిని చాటుకున్నట్టు పురాణాలు ప్రస్తావిస్తున్నాయి. మహిమాన్వితమైనటువంటి ఈ సిద్ధిగణపతి క్షేత్రానికి, ఆరంభంలో 'కేశవస్వామి' క్షేత్రపాలకుడిగా ఉండేవాడట. ఆ తరువాత కాలంలో చాళుక్యులు తమ ఆనవాయతీ ప్రకారం ఇక్కడ 'కాలభైరవుడు'ని ప్రతిష్ఠించారు.
ఆలయ ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుడు ... శ్రీ భూసమేత కేశవస్వామి భక్తులను అనుగ్రహిస్తుంటారు. మహా పవిత్రమైన ఈ పుణ్య క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా - అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. స్థలపురాణాన్ని బట్టి చూస్తే ఈ క్షేత్రం 'కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం' కన్నా పురాతనమైనది. పూర్వం అయినవిల్లిలో 'స్వర్ణ గణపతి' మహాయజ్ఞం జరుగుతూ వుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని 14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన 'శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర'లో పేర్కొనడం జరిగింది. ఈ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడనీ, అనంతర కాలంలో వారే మూగ... చెవిటి ... గుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుడి ఆవిర్భావాన్ని గుర్తించారని స్థలపురాణం చెబుతోంది.
విశాలమైన ప్రాంగణం ... అందమైన గోపుర ప్రాకారాలతో ఈ ఆలయం చూడగానే మనసును దోచేస్తుంది. ఈ క్షేత్రంలో భాద్రపద శుద్ధ చవితి రోజున ... కార్తీక మాసంలో మొదటి సోమవారం ... నాల్గోవ సోమవారం, కృష్ణాష్టమి రోజున గ్రామోత్సవం నిర్వహిస్తారు. గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాలవారు సైతం పాల్గొనే ఈ ఉత్సవం చూడటానికి సందడిగా ... సంబరంగా ... కనుల పండువగా వుంటుంది.