నవదుర్గలు
శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు 'నవదుర్గాలు'గా తొమ్మిది రూపాలను ధరించిందని 'మార్కేండేయ పురాణం'చెబుతోంది. ఆ ప్రకారమే అత్యంత భక్తి శ్రద్ధలతో అందరూ ఆమెను కొలుస్తుంటారు. నవదుర్గలను ... శైలపుత్రి ... బ్రహ్మచారిణి ... చంద్రఘంట ... కూష్మాండ ... స్కందమాత ... కాత్యాయని ... కాళరాత్రి ... మహాగౌరీ ... సిద్ధి ధాత్రి పేర్లతో పిలుస్తుంటారు.
పర్వతరాజు హిమవంతుని పుత్రికగా జన్మించినది కాబట్టి 'శైలపుత్రి'అనీ, శివుడిని భర్తగా పొందడం కోసం తపమాచరించినది కాబట్టి 'బ్రహ్మచారిణి'అని అంటారు. ఇక శిరస్సున చంద్రుడిని ధరించినది కాబట్టి 'చంద్రఘంట' అనీ, అమ్మవారికి గుమ్మడికాయ అంటే ఇష్టం కనుక 'కూష్మాండ అని పిలుస్తారు. అలాగే కూమారస్వామి తల్లి కనుక 'స్కందమాత'గా , కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించినది కనుక 'కాత్యాయని'గా ఆరాధించబడుతోంది.
ఇక కాళరాత్రివలే భయాన్ని కలిగించే రూపంలో ఉంటుంది కనుక 'కాళరాత్రి'అనీ, సాత్విక రూపంలో శివుడిని ఆరాధించినది కనుక 'మహా గౌరీ'అనీ, సర్వ సిద్ధులను ప్రసాదించే తల్లి కనుక 'సిద్ధిధాత్రి'గా ఆమెను సేవిస్తుంటారు. ఇలా అమ్మవారిని వివిధ నామాలతో ... వివిధ రూపాలలో దర్శిస్తూ ... స్మరిస్తూ ... భక్తులు తరిస్తుంటారు.