దైవనామ స్మరణ
ఆకలి వేసినప్పుడు ''అమ్మా''అని ఎంత ప్రేమతో పిలుస్తామో, ఏదైనా కష్టం ... నష్టం కలిగినప్పుడు దైవాన్ని కూడా అంతే ఆర్తితో పిలుస్తుంటాం. ప్రమాదాలు ఎదురైనప్పుడు ... ఆపదలు సంభవించినప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాపాడమంటూ ఆ దైవాన్ని వేడుకుంటూ వుంటాం. ఆ సమయంలో అది పట్టపగలా ... అర్థరాత్రా ... అనేది ఆలోచించం. దేవుడు ఏ క్షణంలో పిలిచినా పలుకుతాడనే నమ్మకమే అందుకు కారణం.
అయితే అర్ధరాత్రి వేళలో దైవాన్ని ప్రార్ధించడం ... ఆయన నామాన్ని స్మరించడం మంచిది కాదని కొంతమంది అంటూ వుంటారు. వేళగాని వేళలో దైవనామస్మరణ చేయడం వలన, ఆ దైవాల ఏకాంతానికి భంగం కలిగించినట్టు అవుతుందని చెబుతుంటారు. దాంతో ఈ సందేహం కొంతమందిని వేధిస్తూనే వస్తోంది. అయితే దైవం ఎప్పుడు పిలిచినా పలుకుతుందనీ ... సమయంతో సంబంధంలేదని పురాణాలు చెబుతున్నాయి.
మునులు ... ఋషులు వంటివారు అనుక్షణం ఆయన నామాన్ని జపిస్తూనే వుంటారు గనుక, ఆయన విశ్రాంతికి ఆటంకమని అనుకోవడంలో అర్థంలేదని తెలుస్తోంది. ఇక శివరాత్రి రోజున జాగారం ఉంటూ శివనామ స్మరణం చేయడాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు.
భగవంతుడు సర్వాంతర్యామి ... ఆయనలేని ప్రదేశంగానీ, ఆయన కరుణలేని జీవిగాని వుండదు. ఎలాంటి పరిస్థితుల్లో వున్నా ... ఎప్పుడు పిలిచినా పలుకుతాడు. అయితే అంతటి భక్తి శ్రద్ధలు ... నియమనిష్టలు కలిగి ఉండాలనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు.