పరశురామావతారం
దశావతారాలలో పరశురామావతారం ఎంతో ప్రత్యేకంగా ... మరెంతో విశేషంగా కనిపిస్తూ వుంటుంది. మహా పతివ్రత అయిన రేణుకా దేవి ... జమదగ్ని మహర్షి దంపతులకు జన్మించిన పరశురాముడు, ముని కుమారుడై వుండి ... క్షత్రియులవలే ఆవేశాన్ని ప్రదర్శించడానికి గల కారణం కూడా లేకపోలేదు.
ఒక రోజున పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో కార్తవీర్యార్జునుడు అక్కడికి వచ్చాడు. వేటతో అలసిన ఆయనకీ ... ఆయన భటులకు జమదగ్ని మహర్షి ఆహార పానీయాలు సమకూరుస్తాడు. ఆ అడవిలో అలాంటి ఏర్పాట్లను ఊహించని కార్తవీర్యార్జునుడు, అందుకు కారణం అక్కడి 'కామధేనువు'అని తెలుసుకుంటాడు. కోరినది వెంటనే ప్రసాదించే ఆ కామధేనువు ఆశ్రమంలో వుండటం కన్నా తన దగ్గర వుండటం మంచిదంటూ దానిని ఇవ్వమని అడుగుతాడు. అందుకు జమదగ్ని మహర్షి నిరాకరించడంతో, అతనిని హతమార్చి ఆ కామదేనువును తీసుకువెళతాడు.
ఆ సమయంలో రేణుకా మాత 21 సార్లు పరశురాముడిని పిలిచింది. తల్లి ద్వారా విషయం తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుడుని తన పరశువుతో సంహరించాడు. తన తల్లి బాధతో 21 సార్లు తనని పిలిచింది కాబట్టి 21 సార్లు ఆయన క్షత్రియులపై దాడి చేసి వారిని హతమార్చాడు. ఇక త్రేతా యుగంలో శ్రీ రాముడు సీతా స్వయం వరంలో శివుడి విల్లును విరిచినప్పుడు పరశురాముడు అక్కడికి వస్తాడు. శ్రీ రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని తెలుసుకుని ఇక తన అవసరం లేదంటూ తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతాడు.