శ్రీ నృసింహావతారం
దశావతారాలలో శ్రీ నృసింహావతారానికి ఓ ప్రత్యేకత వుంది. ఇటు నరుడిగాను ... అటు సింహంగాను శ్రీ మహావిష్ణువు నృసింహ అవతారమెత్తాడు. తల్లిదండ్రులు ... పుట్టుక లేని పరిశుద్ధ అవతారంగా కృతయుగం నుంచి పూజలందుకుంటూ వున్నాడు. మిగతా అవతారాలలో మాదిరిగా ఈ అవతారంలో ప్రశాంతత మచ్చుకి కూడా కనపడదు. దుష్ట శిక్షణ మాత్రమే కాకుండా, ''ఎందెందు వెదికినా అందందే గలడు చక్రీ '' అనే ప్రహ్లాదుని నమ్మకాన్ని నిలబెట్టడానికి ఆయన అప్పటికప్పుడు ఈ రూపంలో అవతరించాడు.
పూర్వం వైకుంఠ నాథుడిని దర్శించుకోవడానికి బ్రహ్మమానస పుత్రులు వచ్చారు. అది స్వామివారి ఏకాంత సమయం కావడంతో, ద్వారపాలకులైన జయ ... విజయులు అడ్డగించారు. దాంతో వారు కోపించి మూడు జన్మలపాటు శ్రీ మహావిష్ణువుకి విరోధులైన రాక్షసులుగా జన్మించమని శపించారు. ఫలితంగా వారి మొదటి జన్మలో హిరణ్యాక్ష - హిరణ్య కశిపులుగా, రెండవ జన్మలో రావణ - కుంభ కర్ణులుగా, మూడవ జన్మలో శిశుపాల - దంతవ్రక్తులుగా జన్మించారు.
'వరాహావతారం'లో హిరణ్యాక్షుడుని శ్రీ మహావిష్ణువు సంహరించడంతో, ఆయన పై ప్రతీకారం తీర్చుకోవడానికి హిరణ్యకశిపుడు తహతాహలాడసాగాడు. బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసి, భూమిపై గాని ... ఆకాశంలో గాని ... నరుల వలన గాని ... మృగాల వలన గాని ... పగలు గాని ... రాత్రి గాని ... ఎలాంటి ఆయుధాల వలన గాని తనకి మరణం లేకుండా వరాన్ని పొందాడు.
హిరణ్య కశిపుడు తన కుమారుడైన 'ప్రహ్లాదుడు' నిరంతరం హరినామ స్మరణం చేస్తుండటాన్ని సహించలేకపోయాడు. చిత్ర హింసలు పెట్టడం వలన కుమారుడి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలమయ్యాయి. శ్రీహరి లేని ప్రదేశమే లేదనీ ... ఎక్కడ పడితే అక్కడ ఆయన ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పిన సమాధానానికి ఆగ్రహించిన హిరణ్యకశిపుడు, అయితే చూపించమంటూ అక్కడే ఉన్న స్తంభమును తన గదతో పగులగొట్టాడు.
అతని వరం గురించి తెలిసిన శ్రీ మహావిష్ణువు, అటు నరుడు ... ఇటు సింహం కాని నృసింహ అవతారంలో వచ్చాడు. భూమి పై ... ఆకాశంలో కాకుండా గడప పై కూర్చుని, రాత్రి - పగలు కాని సంధ్యా సమయంలో ... ఎలాంటి ఆయుధం ఉపయోగించకుండా తన పదునైన గోళ్లతో చీల్చి హిరణ్య కశిపుడిని సంహరించాడు. అలా ఈ అవతారంలో ఆయన దుష్ట శిక్షణ చేసి ... భక్తులపాలిట కొంగుబంగారమై కొనియాడబడుతున్నాడు.