శ్రీ కామరూపాదేవి
అత్యంత మహిమాన్వితమైన ఈ శక్తి పీఠం అస్సాం రాష్ట్రంలోని 'గౌహతి'నగరానికి సమీపంలో ఆవిర్భ వించింది. ఇది సతీదేవి 'యోని'భాగం పడిన ప్రదేశంగా స్థలపురాణం చెబుతోంది. నీలాచలం పర్వతంపై ఆలయంగా భావిస్తోన్న గుహలోకి వెళితే, అక్కడి నుంచి భూగర్భంలోకి మెట్లు కనిపిస్తాయి. వాటి గుండా మరింత లోపలి వెళితే యోని ఆకారంలో ఒక శిల వుంటుంది. ఆ రూపాన్నే అమ్మవారిగా భావిస్తూ అత్యంత నియమ నిష్టలతో కొలుస్తూ ఉంటారు.
ఈ శిల నుంచి వచ్చే జలధార సంవత్సరానికి ఒకసారి ఎరుపు రంగులోకి మారుతుంది. మూడు రోజుల పాటు ఆ నీటి రంగు అలాగే వుంటుంది. అందువలన అమ్మవారు సంవత్సరానికి ఒకసారి 'రజస్వల' అవుతారని భావించి, ఆ మూడు రోజులపాటు గర్భాలయాన్ని మూసివేస్తారు. ఈ మూడు రోజుల పాటు అంతరాళ మంటపంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని వుంచి పూజిస్తారు. ఇక నాలుగో రోజున గర్భాలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేసి 'అంబుజ మేళా' అనే ఉత్సవాన్ని జరుపుతారు.
ఇక లోక కల్యాణం కోసం ముక్కంటిపై మన్మధుడు బాణం వేసి మసిగా మారిందీ ... ఆది దేవుడి అనుగ్రహంతో తిరిగి జీవించింది ఇక్కడేనని అంటుంటారు. కాముడు తిరిగి పునర్జీవితుడు కావడానికి అమ్మవారు ఎంతగానో సహకరించిన క్షేత్రం కనుక, ఇక్కడి అమ్మవారిని 'కామరూపాదేవి'గా కొలుస్తూ వుంటారు.