శ్రీ మాణిక్యాంబా దేవి
'శ్రీ మాణిక్యాంబా దేవి' శక్తి పీఠం ద్రాక్షారామంలో దర్శనమిస్తుంది. దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ఈ ప్రదేశంలో సతీదేవి 'కణతి'భాగం పడినట్టుగా స్థల పురాణం చెబుతోంది. ఇక ఈ ప్రదేశం పంచారామాలలో ఒకటిగా ... త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిచెంది ప్రజల నీరాజనాలు అందుకుంటోంది.
లోక కల్యాణం కోసం తారకాసురుడిని సంహరించ వలసిన బాధ్యత కుమారస్వామికి అప్పగించడం జరిగింది. తారకాసురుడి హృదయ స్థానంలో వున్న శివుడి అమృత లింగాన్ని కుమారస్వామి తన 'శక్తి' ఆయుధంతో ఛేదించడంతో, ఆ అమృత లింగం అయిదు ముక్కలై వివిధ ప్రదేశాల్లో పడింది. ఆ అయిదు భాగాలు పడిన ప్రదేశాల్లోనే దేవతలు వాటిని ప్రతిష్ఠించగా అవి 'పంచారామాలు'గా ప్రసిద్ధి చెందాయి.
ద్రాక్షారామంలో 'భీమేశ్వర స్వామి'ని సూర్య భగవానుడు ప్రతిష్ఠించినట్టు తెలుస్తోంది. ఇక కాశీ నుంచి బహిష్కరించబడిన వ్యాసుడు, దక్షిణ ప్రాంతానికి చేరుకొని అగస్త్య మహర్షితో కలిసి ఇక్కడి భీమేశ్వరుడిని పూజించాడట. ఈ దేవాలయానికి చుట్టుపక్కల కనిపించే సోమేశ్వర ఆలయాలు చంద్రుడు ప్రతిష్ఠించినవిగా చెబుతారు. ఇక ఇప్పుడున్న మాణిక్యాంబాదేవి విగ్రహాన్ని ఆది శంకరుల వారు ప్రతిష్ఠించి పూజించినట్టుగా ఆధారాలు వున్నాయి.