వ్యాస భారతం
'భారతం' రాయాలని వ్యాసుడు నిర్ణయించుకున్నాడు. అయితే తాను చెబుతున్నప్పుడు ఆ వేగాన్ని అందుకుంటూ స్పష్టంగా రాయగలిగే సామర్థ్యం ఎవరికి ఉందనే విషయాన్ని గురించి ఆలోచించసాగాడు. ఆ సమయంలోనే ఆయనకి నారదమహర్షి తారసపడ్డాడు. వ్యాసమహర్షి మనసులోని మాటను తెలుసుకున్న నారదుడు, అందుకు తగినవాడు వినాయకుడేనని చెప్పాడు.
దాంతో వినాయకుడిని కలుసుకున్న వ్యాసుడు తాను వచ్చిన పని గురించి వివరించాడు. 'భారతం' రాయడానికి తాను సిద్ధమేననీ, అయితే తన చేతిలోని 'ఘంటం'క్షణకాలం కూడా ఆగకుండా భారతకథను చెప్పాలనే నియమాన్ని విధించాడు వినాయకుడు. అందుకు అంగీకరించిన వ్యాసుడు ... వినాయకుడిని తీసుకుని 'బదరీనాథ్'లోని సరస్వతీ నదీ తీరానికి తీసుకువెళ్లాడు. అక్కడే భారత రచన జరిగింది.
ఆ సమయంలో వారి ఏకాగ్రతకి భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో సరస్వతీ నది తన దూకుడు తగ్గించుకుని, నెమ్మదిగా ... నిశ్శబ్దంగా ప్రవహించిందని చెబుతారు. అందుకు నిదర్శనంగా ... ఎక్కడాలేని విధంగా ఇప్పటికీ ఈ ప్రదేశంలో సరస్వతీ నది ప్రశాంతంగా ప్రవహిస్తూ వుంటుంది.