పురాణాలు - శ్లోకాలు

పురాణాలు - శ్లోకాలు
భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో 'అష్టాదశ పురాణాలు'ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఈ పురాణాలన్నీ కూడా ఎవరు ... ఎవరితో చెప్పారో, ఎన్ని శ్లోకాలతో ఇవి వివరించ బడ్డాయో తెలుసుకుందాం.

మనువుతో శ్రీ మహా విష్ణువు చెప్పిందే 'మత్స్య పురాణం'... దీనిలోని శ్లోకాల సంఖ్య 14,000.

మార్కండేయ మహర్షి చెప్పిందే 'మార్కండేయ పురాణం' ... దీనిలోని శ్లోకాల సంఖ్య 9,000

దక్షుడికి బ్రహ్మదేవుడు చెప్పినదే 'బ్రహ్మపురాణం' ... దీనిలోని శ్లోకాల సంఖ్య 10,000

మరీచి మహర్షికి బ్రహ్మదేవుడు చెప్పిందే 'బ్రహ్మాండ పురాణం'... దీనిలోని శ్లోకాల సంఖ్య 12,000

నారదమహర్షి తో సావర్ణి చెప్పిందే 'బ్రహ్మ వైవర్త పురాణం' ... దీనిలోని శ్లోకాల సంఖ్య 18,000

మనువుకి సూర్యభగవానుడు చెప్పిందే 'భవిష్య పురాణం'... దీనిలోని శ్లోకాల సంఖ్య 14,500

భూదేవికి శ్రీ మహా విష్ణువు చెప్పిందే 'వరాహపురాణం'... దీనిలోని శ్లోకాల సంఖ్య 24,000

నారద మహర్షికి పులస్త్యుడు చెప్పినదే 'వామన పురాణం' దీనిలోని శ్లోకాల సంఖ్య 10,000

మైత్రేయుడికి పరాశర మహర్షి చెప్పినదే 'విష్ణుపురాణం' ... దీనిలోని శ్లోకాల సంఖ్య 23,000

శివమహిమలను వివరించినదే 'లింగపురాణం' ... దీనిలోని శ్లోకాల సంఖ్య 11,000

భూమి ... సౌరమండలముల గురిచి చెప్పిందే 'వాయుపురాణం' దీనిలోని శ్లోకాల సంఖ్య 24,000

వశిష్ఠ మహర్షికి అగ్నిదేవుడు చెప్పిందే 'అగ్నిపురాణం'... దీనిలోని శ్లోకాల సంఖ్య 15,400

వేదాంగాలు - వ్రతాల గురించి చెప్పిందే 'నారద పురాణం' దీనిలోని శ్లోకాల సంఖ్య 25,000

అన్ని పురాణాల కన్నా ఎక్కువ శ్లోకాలు కలిగి ఉన్నదే 'పద్మపురాణం'... శ్లోకాల సంఖ్య 85,000

పరీక్షిత్ మహారాజుకి శుక మహర్షి చెప్పిందే 'శ్రీ భాగవతం'... దీనిలోని శ్లోకాల సంఖ్య 18,000

గరుత్మంతుడికి విష్ణుమూర్తి చెప్పిందే 'గరుడపురాణం'... దీని శ్లోకాల సంఖ్య 19,000

సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు చెప్పిందే 'కూర్మపురాణం'... దీనిలోని శ్లోకాల సంఖ్య 17,000

కుమారస్వామి చెప్పినదే 'స్కంద పురాణం' ... దీనిలోని శ్లోకాల సంఖ్య 81,000

More Bhakti Articles