బసవన్న పెరిగే యాగంటి
'యాగంటి' పేరు వినగానే కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకేస్తాడని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. యుగాంతంతో ముడిపడివున్న ప్రసిద్ధమైన పుణ్య క్షేత్రం యాగంటి. ఇది కర్నూలు జిల్లా బనగానపల్లికి సమీపంలో వుంది. ఇక్కడి కొండల నడుమ కొలువుదీరిన శివయ్యను చూస్తే మనసు పులకించిపోతుంది. యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. వీటిలో 'వెంకటేశ్వరస్వామి గుహ' ... 'శంకర గుహ' ... 'రోకళ్ల గుహ' అనేవి ఆధ్యాత్మిక చింతనకు ఆనవాళ్లుగా కనిపిస్తుంటాయి. అగస్త్య మహర్షి శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను ప్రతిష్టించిన గుహను వెంకటేశ్వరస్వామి గుహ అనీ ... శివలింగాన్ని ప్రతిష్టించిన గుహని రోకళ్ల గుహ అని అంటారు. ఇక శంకరగుహ దగ్గరే వీరబ్రహ్మేంద్రస్వామి వారు తన శిష్యులకు జ్ఞానోపదేశం చేశాడని చెబుతుంటారు.
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి స్వామివారి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరి తరిస్తుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని 'అగస్త్య పుష్కరిణి' అని అంటారు. ఇక యాగంటిలో ఎటు చూసినా మనకి ఒక్క కాకి కూడా కన్పించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.
ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం ... పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో పరవశించాలనుకునే వారు ... శివయ్య అనుగ్రహం కోసం పరితపించేవారు ఈ క్షేత్రానికి వెళితే చాలు ... వేయి జన్మలకు సరిపడా పుణ్యఫలం ఒక్క దర్శనంతోనే దక్కుతుంది.