చిరంజీవులు

చిరంజీవులు
సాధారణంగా పిన్నలను 'చిరంజీవ'అంటూ పెద్దలు ఆశీర్వదిస్తుంటారు.'చిరంజీవ'అంటే చిరకాలం జీవించువాడని అర్థం. మానవుడిగా జన్మించాక అది సాధ్యమేనా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంటుంది. అయితే దైవం ... దైవాంశ సంభూతులు అలా ఆశీర్వదించినప్పుడు అది తప్పక జరుగుతుంది. అలాంటి ఆశీర్వాదాల బలం కారణంగా చిరంజీవులుగా మిగిలిపోయిన వాళ్లు లేకపోలేదు.

ద్రోణుడు - కృపి దంపతులకు జన్మించి, మహాభారత యుద్ధంలో కీలకమైన పాత్రను పోషించిన అశ్వత్థామ చిరంజీవిగా మిగిలిపోయాడు. ప్రహ్లాదుడి మనుమడైన 'బలిచక్రవర్తి' .., సత్యవతి - పరాశరుల కుమారుడైన 'వ్యాసుడు' .., కేసరి - అంజనాదేవి పుత్రుడైన 'హనుమంతుడు' చిరంజీవులుగా మిగిలిపోయారు.

అలాగే విశ్రవసుడు - కైకసి దంపతులకు జన్మించిన 'విభీషణుడు' .., మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడిన 'కృపాచార్యుడు' .., రేణుక - జమదగ్ని కుమారుడైన 'పరశురాముడు' చిరంజీవులుగా నిలిచిపోయారు.

More Bhakti Articles