సహనాన్ని మించిన సంపద లేదు
ఎవరైనా ఏ విషయంలోనైనా సహనాన్ని కలిగివుండటం అవసరం. సహనమనేది శాంత స్వభావానికి ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. ఎక్కడ శాంతమనేది వుంటుందో ... అక్కడే సహనమనేది వుంటుంది. అలాంటి సహనం వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెడుతూ వస్తుంటుంది. సహనాన్ని కోల్పోవడమంటే ఎదుటివాళ్ల ముందు తక్కువైపోవడమే ... వాళ్లకి దూరమైపోవడమే.
మనం సహనాన్ని కోల్పోవడం వలన అవతలి వ్యక్తి ఎంతగా బాధపడతాడో, ఎదుటివాళ్లు సహనాన్ని కోల్పోయినప్పుడు అనుభవంలోకి వస్తుంటుంది. సహనాన్ని కోల్పోవడం వలన కలిగే ఫలితం, ఆ తరువాత శాంతమూర్తిగా మారిపోయినా అలాగే వుంటుంది. సాధారణంగా భార్యాభర్తలు తమ పిల్లలను వెంటబెట్టుకుని పుణ్యక్షేత్రాలకి వెళుతూ వుంటారు. గాలి మార్పును గుర్తించి ఏడుపు మొదలుపెట్టే చిన్నపిల్లలు, అక్కడి రద్దీ వాతావరణం అలవాటులేక ఇంకొంత చిరాకు చేస్తారు.
అయితే కొంతమంది భార్యతో పాటు తమ బిడ్డను సముదాయించడానికి ప్రయత్నించగా, మరికొందరు పిల్లలు చిరాకు చేయడానికి భార్యని కారకురాలిని చేస్తూ అక్కడే చీవాట్లు పెట్టడం మొదలుపెడతారు. పిల్లలిని సముదాయించడం రానప్పుడు ఎందుకు బయలుదేరావంటూ అసహనాన్ని ప్రదర్శిస్తారు. ఆ సమయంలో తాము దైవసన్నిధిలో ఉన్నామనిగానీ ... చుట్టుపక్కల వాళ్లు తమని గమనిస్తున్నారనే విషయంగాని వాళ్లకు పట్టదు.
తీవ్రమైన అసహనానికి లోనైనందు వలన భర్త ... చిన్నబుచ్చుకున్నందు వలన భార్య .. ఇద్దరూ కూడా ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోలేకపోతారు. ఆలయంలో నుంచి బయటికి వచ్చిన తరువాత, తాను ఆవిధంగా ప్రవర్తించి ఉండవలసిందికాదని భర్త అనుకుంటాడు. తనే కదా ఆమెను బయలుదేరదీసిందని పశ్చాత్తాపపడతాడు. అలా అని చెప్పేసి అంత రద్దీలో మళ్లీ ఆమెని దర్శనానికి తీసుకుని వెళ్లలేడు.
తాను ఎప్పుడంటే అప్పుడు ఆ క్షేత్రానికి రావచ్చు ... కొంచెం కష్టమైనా దైవదర్శనం చేసుకోవచ్చు. కానీ భార్యా పిల్లలతో బయలుదేరడం అన్ని సమయాల్లోను కుదరదు. అందువలన పిల్లలను తాను చూసుకుని, ఆమె దైవ దర్శనానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చివుంటే బాగుండునని ఆ భర్తకు అనిపిస్తుంది. ఆ బాధ అప్పుడప్పుడు హృదయాన్ని భారం చేస్తూనే వుంటుంది. ఇలాంటప్పుడే సహనాన్ని మించిన సంపద లేదనిపిస్తుంది ... సహనాన్ని కోల్పోవడమంటే ఆనందానుభూతులను కోల్పోవడమేననిపిస్తుంది.