సంపెంగలు
పుణ్య క్షేత్రాలలో ఎప్పుడూ ఉత్సవాలు ... ఊరేగింపులు జరుగుతూనే వుంటాయి. ఈ సమయంలో స్వామివారిని వివిధ రకాల పూలతో అలంకరిస్తూ వుంటారు. ఇక తిరుమల వంటి పుణ్య క్షేత్రాల్లో స్వామివారి సేవ కోసం నిరంతరం రకరకాల పూల మాలలు సిద్ధమ వుతూనే వుంటాయి. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి, గులాబీలు ... మల్లెలు ... పొగడలు ... వంటి వివిధ రకాల పూలతో కట్టిన మాలలతో స్వామివారిని అందంగా అలంకరిస్తూ వుంటారు.
ఈ పూలమాలలు స్వామివారి వైభవానికి అద్దం పడుతూ, ఆయన తేజస్సుకు పరిమళాన్ని జత చేస్తుంటాయి. పూలన్నీ రంగడి కోసమే పూసినా, వాటిలో 'సంపెంగలు' ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే ఆ బ్రహ్మాండ నాయకుడి అలంకరణలో సంపెంగలు ముందువరుసలో కనిపిస్తాయి.
అన్ని పూవులకన్నా సంపెంగలు అరుదుగా దొరుకుతాయనో ... వాటి సువాసన ఎక్కువగా ఉంటుందనో శ్రీహరి వాటిపై మక్కువ పెంచుకోలేదు. మిగతా పూలపై తుమ్మెదలు వాలి వాటి సుగంధాన్ని ఆస్వాదించడం ... మకరందాన్ని తమ సొంతం చేసుకోవడం చేస్తుంటాయి. కాని సంపెంగ పూలపై తుమ్మెదలు వాలవు ... అందువలన వాటి మకరందాన్ని పీల్చే అవకాశం లేదు. తుమ్మెదలు కూడా వాలని పుష్పాలు కాబట్టి శ్రీ మహావిష్ణువు వాటిని ఇష్టపడతాడని పురాణాలు చెబుతున్నాయి.