ఈ హనుమంతుడు పానక ప్రియుడు
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని పానకాల స్వామిగా పిలుస్తుంటారు. ఇక్కడి స్వామికి పానకాన్ని సమర్పించడం వెనుక ఆసక్తికరమైన కథనం దాగి వుంది. స్వామికి ఎంత పానకం తీసుకు వచ్చినా, అందులో సగం తాగేసి మిగతా సగం భక్తుల కోసం అన్నట్టుగా వదిలేస్తుంటాడు. ఈ కారణంగా స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు భావిస్తుంటారు. అంకిత భావంతో ఆ స్వామిని ఆరాధిస్తూ వుంటారు.
ఇదే విధంగా హనుమంతుడు పానకం తాగే ఆలయం కూడా ఒక ఊళ్లో వుంది ... ఆ ఊరే 'సీతానగరం'. హనుమంతుడు ఆవిర్భవించిన విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ ఊరు ... గుంటూరు జిల్లా కృష్ణానదీ తీరంలో అలరారుతోంది. ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన హనుమంతుడు మహిమాన్వితుడని చెబుతుంటారు. ఆ విశేషాలను గురించి భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు.
సీతారాములకి ... ఈ ప్రదేశానికి ఏదో సంబంధం ఉండివుంటుందనీ, అందువల్లనే హనుమంతుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించాడని స్థానికులు అంటారు. ఈ కారణంగానే ఇక్కడ సీతారాముల ఆలయం నిర్మించబడినట్టు చెబుతారు. ఇక్కడి స్వామికి పానకమంటే ప్రాణమట. తమ కోరికలు నెరవేరితే స్వామివారికి పానకం సమర్పిస్తామని భక్తులు మొక్కుకుంటూ వుంటారు. అలా కోరికలు నెరవేరిన వారు స్వామివారికి శంఖంతో పానకం సమర్పిస్తూ వుంటారు.
శంఖంతో స్వామివారికి పానకం సమర్పించిన ప్రతిసారి, అందులో సగం పానకాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తూ వుండటం విశేషం. అలా స్వామివారు వదిలిన పానకాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తూ వుంటారు. విశేషమైన పర్వదినాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. హనుమంతుడిని దర్శించడం వలన గ్రహ సంబంధమైన పీడలు ... అనారోగ్యం వలన కలిగే బాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ స్వామికి ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ కృతజ్ఞతలు తెలుపుతుంటారు.