పగడాలు

పగడాలు
ప్రాచీన కాలం నుంచి కూడా నవరత్నాలు (వజ్రం - వైడూర్యం - ముత్యం - పగడం - గోమేధికం - నీలం - పుష్యరాగం - మరకతం - మాణిక్యం) ప్రత్యేకతను ... ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విలువ పరంగానే కాకుండా వివిధ గుణాల కారణంగా నవరత్నాలు మహిమాన్వితమైనవిగా చెప్పబడ్డాయి. ప్రాచీన కాలంలో స్త్రీలు - పురుషులు కూడా వీటిని విరివిగా వాడేవారు. ఆధునిక కాలంలో కూడా ఆ సంఖ్య పెద్దగా తగ్గక పోవడం విశేషం.

నవరత్నాలలో ముత్యాలు ... పగడాలు ... నల్లపూసలు మాత్రం ఆనాటి స్త్రీలు తప్పని సరిగా ధరించేవారు. ఈ మూడింటిని ధరించడానికి జాతకాలతో పనిలేదని ఆనాటి పెద్దలు భావించేవారు. ఈ కారణంగానే వివాహిత స్త్రీలు తమ మంగళ సూత్రానికి ఒక ముత్యం ... ఒక పగడం ... ఒక నల్లపూస వేసి కట్టుకునేవారు.

ఇక వివాహిత స్త్రీలు తాము తల్లిగా మారే క్షణం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. 'పగడాలు' సంతానకారకాలుగా పనిచేస్తూ మహిమాన్వితమైనవిగా చెప్పబడ్డాయి. ఈ కారణంగానే ఆనాటి స్త్రీలు పగడాలను తప్పని సరిగా ధరించేవారని తెలుస్తోంది. సరైన రత్నాలను ధరించినట్టయితే అవి రత్నశాస్త్రం చెప్పిన సమయంలోగా తమ ప్రభావం చూపుతాయని అంటారు.

వజ్రం ... ఇరవై రెండు రోజుల్లోను, వైడూర్యం ... నెలరోజులలోను, పగడం ఇరవై ఒక్క రోజుల్లోను, గోమేధికం ... ఇరవై తొమ్మిది రోజుల్లోను, నీలం ... మూడు రోజుల్లోను, పుష్యరాగం ఏకాదశి - ద్వాదశి మధ్య రోజుల్లోను, మరకతం ... వారం రోజులలోను, మాణిక్యం రెండు ఏకాదశుల కాలంలోనూ తమ ప్రభావం చూపుతాయని శాస్త్రం చెబుతోంది.

More Bhakti Articles