అదే అంబరీషుడి గొప్పతనం !
అంబరీషుడు అనునిత్యం శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తూ ... ఆనందిస్తూ వుంటాడు. సాధారణంగా రాజ కుటుంబానికి చెందిన వాళ్లు, యవ్వనంలోకి అడుగుపెట్టగానే వేటకి ... విందు వినోదాలకి సమయాన్ని కేటాయిస్తుంటారు. అలాంటిది అంబరీషుడు అలాంటివన్నీ పక్కన పెట్టి విష్ణు నామ సంకీర్తనం చేస్తూ వుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అలాంటి పరిస్థితుల్లోనే ఒక రోజున ఆయన దేవాలయానికి వెళతాడు. అప్పటికే ఎంతోమంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడానికి నిరీక్షిస్తుంటారు. రాచబిడ్డ కావడంతో, ఆలయ అర్చకులు ముందుగా ఆయన పేరున పూజ చేయడానికి సిద్ధపడతారు. తన కన్నా ముందుగా వచ్చిన భక్తులు ఎంతోమంది వుండగా, వాళ్లని వదిలి తనని ప్రత్యేకంగా చూడటం ఇబ్బందిని కలిగిస్తుందని చెబుతాడు అంబరీషుడు.
అది తరతరాలుగా వస్తోన్న సాంప్రదాయమనీ, రాచకుటుంబీకులు ఎవరొచ్చినా ముందుగా వారికే ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని ఆలయ సిబ్బంది చెబుతారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులేననీ, ఆయన ఆరాధనకు అర్హతలను నిర్ణయించడం సరికాదని అంటాడు అంబరీషుడు. భగవతుడిని ఎవరు దర్శించడానికి వచ్చినా ఆయన అనుగ్రహం కోసమేననీ, ఆ స్వామిని కోరుకునే స్థాయిలో నిలబడి వున్నప్పుడు అంతా ఒక్కటేనని అంటాడు.
భగవంతుడి సన్నిధిలో ప్రత్యేకతను కోరుకోవడం అమాయకత్వం అవుతుందనీ, తాను ఎప్పుడు ఆలయానికి వచ్చినా అందరితో సమానంగానే చూడమని చెబుతాడు. భగవంతుడి సన్నిధిలో భక్తుల మనసు నొచ్చుకో కూడదనీ, అందరికీ ఆ దైవం అనుగ్రహం లభించినప్పుడే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అంటాడు. ఆయన మంచితనం అక్కడి భక్తుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుంది. ఆయన రాజ్యాధికారాన్ని స్వీకరిస్తే తమ జీవితం ఆనందమయం అవుతుందనే విశ్వాసం కలుగుతుంది.