వెదురు పొదల్లో వెలసిన దేవుడు
సుబ్రహ్మణ్యస్వామి ఆవిర్భవించిన విశిష్టమైన క్షేత్రాలలో 'మల్లాం' ఒకటిగా చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా పరిధిలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రాన్ని 'తిరుగుడు మల్లాం'గా కూడా పిలుస్తుంటారు. అనేక విశేషాలకు ... మహిమాలకు నిలయంగా ఈ క్షేత్రం కనిపిస్తూ వుంటుంది. ఈ ప్రాంతంలో స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించాడు. అయితే ఈ విగ్రహానికి చేతులు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
గర్భాలయంలో ప్రస్తుతం దర్శనమిస్తోన్న స్వామివారికి ఒకవైపున చేతులు లేని ఈ ప్రతిమ దర్శనమిస్తుంది. ఇక స్వామివారికి చేతులు లేకపోవడం వెనుక ఆసక్తికరమైన కథనం స్థలపురాణంగా వినిపిస్తూ వుంటుంది. దేవలోకాన్ని ఆక్రమించడానికీ ... సాధు జనులను హింసించడానికి ప్రయత్నించిన అనేక మంది అసురులను సుబ్రహ్మణ్యస్వామి సంహరిస్తాడు. ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం పవిత్రమైన ఈ ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉండిపోతాడు.
కాలక్రమంలో స్వామివారి చుట్టూ పుట్టలు ... వెదురు పొదలు పెరిగిపోతాయి. ఒకసారి తన పరివారంతో కలిసి ఈ మార్గంలో వస్తోన్న పాండ్య భూపతి, అవసరార్థం అక్కడి వెదురు బొంగులను కొట్టిస్తాడు. ఆ సమయంలో కత్తులకు రక్తం అంటుకోవడం చూసి పనివాళ్లు ఆశ్చర్యపోతారు. విషయం తెలుసుకున్న రాజు, పరిశీలించి చూడగా వెదురు పొదల మధ్య చేతులు తెగిన స్వయంభువు సుబ్రహ్మణ్య స్వామివారి ప్రతిమ కనిపిస్తుంది.
తాను చేసిన తప్పు పాండ్యరాజుకి అర్థమైపోవడంతో తనని మన్నించమంటూ పశ్చాత్తాపంతో స్వామిని వేడుకుంటాడు. తన పాపానికి పరిహారం సెలవీయమని ప్రార్ధిస్తాడు. ఈ ప్రదేశంలో తనకి ఆలయాన్ని నిర్మించడం వలన అతని పాపం పరిహరించబడుతుందని స్వామి చెబుతాడు. అలా స్వామివారి ఆదేశం మేరకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించిన పాండ్యరాజు తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు.