సకల జీవులలోను తానున్నానన్న సాయి
భక్తుల మధ్యనే నిరాడంబరంగా ఉంటూ భగవంతుడిగా తన లీలావిశేషాలను చూపిన మహనీయుడు శ్రీ శిరిడీ సాయిబాబా. తనని నమ్మిన భక్తులను నీడలా అనుసరిస్తూ, అనుక్షణం వాళ్లని కాపాడుతూ వుండటం ఆయన ప్రత్యేకత. తనని విశ్వసించిన భక్తులనే కాదు, మూగ జీవులను కూడా ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు.
ప్రతి ఒక్కరూ భూతదయను కలిగి వుండాలని చెప్పేవాడు. తన ఎదురుగా ఎవరైనా మూగ జీవులను కొడితే సహించేవాడు కాదు. సకల జీవులలోను తాను ఉన్నానని ఆయన చెప్పేవాడు. ఒకసారి ఒక భక్తురాలు బాబాకి రొట్టెలు తీసుకుని మశీదుకి బయలుదేరుతుంది. దార్లో ఓ కుక్క ఎదురైతే ఆమె దానికి ఒక రొట్టె ముక్క వేసి మశీదుకి చేరుకుంటుంది. కుక్కకి ఆమె రొట్టెముక్క పెట్టినప్పుడే తన ఆకలి తీరిపోయిందని బాబా చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోతుంది.
ఇక ఆయాసంతో బాధపడుతోన్న ఒక భక్తుడు, బాబా వద్దన్నా పెరుగుతింటూ ఉండేవాడు. అయితే ప్రతి రోజు ఒక పిల్లి దొంగచాటుగా వచ్చి ఆ పెరుగును ఒలకబోసిపోతూ వుండేది. వ్యాధి తగ్గిన తరువాత ఆ భక్తుడు ఆ విషయాన్ని బాబా దగ్గర ప్రస్తావిస్తే, ఆ దొంగపిల్లిని తానేనంటూ ముసిముసినవ్వులు నవ్వుతూ అంటాడు బాబా. ఇక బాబా పట్ల ప్రేమతో ఒక భక్తుడు ఆయనకి ఒక గుర్రాన్ని కానుకగా ఇస్తాడు.
ఆ గుర్రానికి శ్యాంసుందర్ అని ముచ్చటగా పేరు పెట్టిన బాబా, దాని బాధ్యతను తుకారం అనే వ్యక్తికి అప్పగిస్తాడు. ఒకసారి తుకారామ్ ఆ గుర్రాన్ని కొడితే, ఆ దెబ్బలు బాబాకి తగులుతాయి. ఆ దెబ్బలకు బాబా బాధపడుతూ వుంటే, అక్కడి వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. సకల జీవులలోను తాను వున్నానని బాబా చెప్పడంలోని ఆంతర్యమేమిటో అప్పుడు వారికి బోధపడుతుంది.