విశేష ఫలితాలనిచ్చే జ్యేష్ఠ పౌర్ణమి

విశేష ఫలితాలనిచ్చే జ్యేష్ఠ పౌర్ణమి
జ్యేష్ఠ మాసంలో అత్యంత ముఖ్యమైన పర్వదినంగా 'జ్యేష్ఠ పౌర్ణమి' చెప్పబడుతోంది. ఈ రోజున చేసే దానాల వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున పాదరక్షలు ... గొడుగులు దానం చేయడం వలన 'అశ్వమేథ యాగం' చేసినంతటి ఫలితం కలుగుతుంది. అందువలన చిన్నచిన్న దానాల వలన అనంతమైన ఫలితాలను అందించే పర్వదినంగా జ్యేష్ట పౌర్ణమి గురించి చెబుతుంటారు.

ఇక ఈ రోజున 'వట సావిత్రి వ్రతం' చేయడం వలన, సౌభాగ్యం స్థిరమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజున వివాహిత స్త్రీలు 'మర్రిచెట్టు' ను పూజిస్తూ వుంటారు. ఇక ఇదే రోజున రైతుల పండుగగా చెప్పబడుతోన్న 'ఏరువాక పున్నమి' కూడా జరుపుతుంటారు. రైతులు తమకి జీవనాధారమైన నేలతల్లిని ... ఎద్దులను పూజించి ఈ రోజున పొలాన్ని దున్నడం ప్రారంభిస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు ఎక్కువగా వుంటాయి కనుక, ఈ పండుగ సంబరాలు అక్కడే ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి ... కనువిందు చేస్తూవుంటాయి. దానాలు చేయడం వలన ... వట సావిత్రి వ్రతం వలన పుణ్యఫలాలను, ఏరువాక పండుగ వలన ఆనందాలను అందించేదిగా జ్యేష్ట పౌర్ణమి ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.

More Bhakti Articles