శ్రీ యంత్రం
నిత్యజీవితంలో 'శ్రీ' అనే అక్షరాన్ని మనం శుభసూచకంగా ... ఐశ్వర్య ప్రదాయకంగా భావిస్తుంటాం.'శ్రీ'అనేది మహావిష్ణువుకు ... లక్ష్మీదేవికి సంబంధించిన సంయుక్తాక్షరం. 'శ్రీ' అనే అక్షరం ఎంతటి పవిత్రమైనదో ... 'శ్రీ యంత్రం' అంతటి శక్తివంతమైనది. యంత్రంలేని పూజ వలన ప్రయోజనం ఉండదనేది శాస్త్ర వాక్యం. అందువలన ప్రతి దేవాలయంలోను యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది.
అన్ని యంత్రాల్లోకి అత్యంత శక్తి వంతమైన శ్రీ యంత్రం తనని పూజించిన వారిని ఓ రక్షా కవచంలా కాపాడుతూ వుంటుంది. దీని మహిమలను గురించి ఎన్నో ధర్మశాస్త్ర గ్రంధాలు ప్రస్తావించడం జరిగింది. లక్ష్మీనారాయణుల స్వరూపమైన 'శ్రీ యంత్రం' బంగారం ... వెండి ... రాగి ... ఇలా ఏడు లోహాలను కలిపి తయారు చేస్తారు.
ఈ 'శ్రీ'యంత్రాన్ని ఇంట్లో స్థాపన చేయడం వలన ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి ... అకాల మృత్యువు బారి నుంచి అనుక్షణం రక్షణ లభిస్తుంది. అయితే ఎంతో నియమ నిష్టలను పాటించవలసి వుంటుంది. శ్రీ యంత్రం బంగారముతో గానీ ... తామ్రముతో గాని ... పంచలోహాలతోగాని చేసినదై ఉండాలి. లక్ష్మీ దేవికి ఎరుపు రంగు ... శ్రీ మహా విష్ణువుకు పసుపు రంగు అంటే ప్రీతి. అందువలన శ్రీ యంత్ర స్థాపన కోసం, పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి. ఆ వస్త్రంలో తమలపాకులు వుంచి, వాటిపై పాలతో అభిషేకించిన శ్రీ యంత్రాన్ని ఉంచాలి.
పసుపు ... కుంకుమ ... అక్షితలు ... గులాబీ పూలు ... కొన్ని బియ్యం ... నీటితో నింపిన కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీనారాయణుడిని మనసారా స్మరించుకుని 2,816 మంది దేవతలు నివసించే శ్రీయంత్రాన్ని పూజించి, ఆ తరువాత పెరుగు - బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. 'తొమ్మిది ముఖాలు' కలిగి ఉండే ఈ శ్రీ యంత్రం మూడు భాగాలుగా వుంటుంది. భూపురం నుంచి అష్టదళం వరకూ ఉండేది 'సృష్టి చక్రం' ... చతుర్దశ నుంచి అంతర్దశ వరకూ వుండేది 'స్థితి చక్రం' ... అష్టార్దశ నుంచి బిందువు వరకూ వుండేది 'సంహార చక్రం' ఈ మూడు చక్రాలను కలిపి 'త్రిపుర' అంటారు ... ఆమే శ్రీ మహా త్రిపుర సుందరి.
శ్రీ యంత్రాన్ని దీపావళి రోజు రాత్రి పూజా మందిరంలో వుంచి 108 దీపాలు వెలిగించాలి. తామర విత్తుల మాలతో 108 సార్లు ''ఓం శ్రీం హ్రీం శ్రీ కమలవాసిన్యౌ నమః'' అనే మంత్రాన్ని పటించాలి. ఆ తరువాత ఆ యంత్రాన్ని డబ్బు పెట్టే చోట ఉంచితే ఆర్ధిక పరిస్థితి వెంటనే మెరుగు పడుతుంది.
ఇక మహిమాన్వితమైన ఈ శ్రీ యంత్రాన్ని పూజించడానికి .. కార్తీక .. మాఘ .. వైశాఖ .. జ్యేష్ట .. మాసాలు, పంచమి .. సప్తమి .. ద్వాదశి .. త్రయోదశి .. పౌర్ణమి .. తిధులు, బుధ .. గురు .. శుక్రవారాలు .., పుష్యమి .. హస్త .. ఉత్తర .. ఫల్గుణి .. స్వాతి .. రేవతి .. నక్షత్రాలు మంచివని శాస్త్రం చెబుతోంది.