ఆర్ధికపరమైన స్థిరత్వాన్ని కలిగించే రుద్రాక్ష

నిత్యజీవితంలో కొంతమంది సంపాదనకి అధిక ప్రాధాన్యతను ఇస్తారు ... మరికొంత మంది ఆవసరాలు తీరెంత ఆదాయం వుంటే చాలనుకుంటారు. అవసరాలు తీరడానికే అయినా ... ఆశలు తీరడానికే అయినా ధనమనేది తప్పనిసరిగా కావలసిందే. డబ్బు అనేది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది ... ఆ డబ్బే సమస్య అయినప్పుడు అన్నీ దూరమవుతాయి.

ఇలా ఆర్ధికపరమైన సమస్యలను ఎదుర్కుంటోన్న వాళ్లు ఆదాయ మార్గాలనే కాదు, ఆధ్యాత్మిక పరమైన మార్గాలను కూడా అన్వేషిస్తూనే వుంటారు. ఈ నేపథ్యంలో 'షణ్ముఖి రుద్రాక్ష'ను ధరించిన వాళ్లు ఆర్ధిక పరమైన సమస్యల బారి నుంచి బయట పడతారని శాస్త్రం చెబుతోంది. రుద్రాక్ష పరమశివుడి కన్నీటి బిందువు నుంచి ఆవిర్భవించినది కనుక, ఇది మహాశక్తిమంతమైనదిగా చెప్పబడుతోంది.

రుద్రాక్షలలో ఎన్నో రకాలు వున్నాయి ... దేని విశిష్టత దానిదే. రుద్రాక్షకు గల ముఖాలనుబట్టి వాటిని పిలుస్తుంటారు. ఒక్కో రుద్రాక్ష ధరించడం వలన ఒక్కో ప్రయోజనం ఉంటుంది. ఈ నేపథ్యంలో సంపదలు వృద్ధి చెందాలని కోరుకునే వాళ్లు 'షణ్ముఖి రుద్రాక్ష'ను ధరించవలసి వుంటుంది. ఆరు ముఖాలు కలిగిన ఈ రుద్రాక్షను లక్ష్మీదేవి సన్నిధిలో వుంచి పూజించి, ఆ తరువాత ధరించవలసి వుంటుంది.

అలా అత్యంత భక్తి శ్రద్ధలతో ... పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ రుద్రాక్షను ధరించడం వలన దారిద్ర్యం దూరమవుతుంది. ఆదాయాన్ని పెంచుకునే అనేక మార్గాలు కనిపిస్తాయి. అప్పులబాధాలు తీరిపోవడమే కాకుండా, ఆర్ధికపరమైన స్థిరత్వం కలుగుతుంది. ఇలా ఆర్ధికపరమైన అన్ని విషయాలను ఈ రుద్రాక్ష ప్రభావితం చేస్తుంది. అందువలన నిష్ఠతో ఈ రుద్రాక్షను ధరించి .. నియమాలను పాటిస్తూ వుంటే, ఆర్ధికపరమైన విజయాలు సొంతమవుతూ ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News