సాలగ్రామ స్వరూపంగా సాక్షాత్కరించే దైవం
భగవంతుడు అర్చావతారమూర్తిగా అనేక పవిత్రమైన ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. కొన్ని క్షేత్రాల్లో స్థానక భంగిమలో నుంచుని ... మరికొన్ని క్షేత్రాల్లో శయనముద్రలోను ఆయన దర్శనమిస్తుంటాడు. గర్భాలయంలో స్వామివారు ఏ ముద్రలో కొలువుదీరినా, భక్తులు ఆయన దివ్యమంగళ రూపాన్ని దర్శించి తరించడానికి తరలివస్తూనే వుంటారు ... తరించిపోతూనే వుంటారు.
అలా ఆ శ్రీమహావిష్ణువు తన సమ్మోహన రూపాన్ని 'ఆదికేశవ పెరుమాళ్'గా ఆవిష్కరించిన క్షేత్రం, కేరళా ప్రాంతానికి చెందిన 'తిరువాట్టూరు'లో కనిపిస్తుంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందిన ఈ క్షేత్రానికి రెండువైపులా రెండు నదులు ప్రవహిస్తోన్న కారణంగా ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఆలయ నిర్మాణం ఆనాటి వైభవానికి ఓ మచ్చుతునకగా కనిపిస్తూ వుంటుంది.
ఆదికేశవ పెరుమాళ్ ఆదిశేషుడిపై శయనించి వుండగా, అమ్మవారు మరకతవల్లి తాయారు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటుంది. గర్భాలయం నిండుగా కనిపించే స్వామి రూపం 16008 సాలగ్రామాలతో తయారుచేయబడినట్టుగా స్థలపురాణం చెబుతోంది. స్వామివారి పూర్తిరూపాన్ని ఒకే ద్వారం నుంచి దర్శించుకోవడానికి వీలుండదు. అనంతపద్మనాభ స్వామిని చూసినట్టుగానే మూడు ద్వారాల ద్వారా ఈ స్వామిని దర్శించుకోవాలి.
ఈ క్షేత్రంలో గల శ్రీరామపుష్కరిణిలో స్నానమాచరించిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటూ వుంటారు. తమ మనసులోని కోరికలను ఆయనకి నివేదించుకుంటూ వుంటారు. పండుగలు ... పర్వదినాల్లోనే కాదు, సాయం సమయాల్లో స్వామివారి మోముపై ప్రసరించే సూర్య కిరణాలను చూడటానికి భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. సూర్యుడు స్వామివారికి హారతి పడుతున్నట్టుగా అనిపించే మనోహరమైన ఈ దృశ్యం భక్తుల మనోఫలకంపై ఎప్పటికీ నిలిచిపోతుంది.
ఎంతోమంది దేవతలకు ... మహర్షులకు స్వామివారు ఇక్కడ దర్శనమిచ్చారు. ఎంతోమంది రాజులు స్వామివారిని అనునిత్యం సేవిస్తూ ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక్కడి స్వామిని సేవించడం వలన కష్టాలు కరిగిపోతాయనీ, సంతోషాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.