ఏడువారాల నగలు
పూర్వకాలం నుంచి కూడా స్త్రీలు ఆభరణాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ వస్తుండటం చూస్తున్నాం. రకరకాల ఆభరణాలను చేయించుకుంటూ ... వాటిని నలుగురికీ చూపిస్తూ వాళ్లు మురిసిపోతుంటారు. ఇక పుట్టింటి వారు చేయించిన ఆభరణాలను వాళ్లు మరింత అమూల్యమైనవిగా భావిస్తుంటారు. వంశపారం పర్యంగా వచ్చే 'ఏడువారాల నగలు'ను వాళ్లు ఎంతో అపురూపంగా చూసుకుంటూ వుంటారు.
అప్పట్లో సమాజంలో తమ స్థాయిని తెలిపేవిగా ఏడువారాల నగలను స్త్రీలు ధరించేవారు. ప్రతి నిత్యం ధరించకపోయినా పర్వదినాల్లో మాత్రం తప్పని సరిగా వీటిని ధరించేవారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ కూడా కొన్ని కుటుంబాల్లో ఏడువారాల నగలు ధరించే ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. స్త్రీలు ప్రాణప్రదంగా భావించే ఏడువారాల నగల వెనుక ఆరోగ్య పరమైన కారణం దాగివుంది.
ఆదివారం రోజున 'కెంపులు'... సోమవారం రోజున 'ముత్యాలు'... మంగళవారం రోజున 'పగడాలు'... బుధవారం రోజున 'పచ్చలు'... గురువారం రోజున 'పుష్యరాగాలు'... శుక్రవారం రోజున 'వజ్రాలు'... శనివారం రోజున 'నీలాలు' స్త్రీలు ధరించే ఆభరణాల్లో వుండాలని పెద్దలు నియమం చేశారు.
ఈ క్రమంలో ఏడువారాల నగలు ధరించడం వలన ఆయురారోగ్యాలు పెరుగుతాయనీ ... సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని స్త్రీలు విశ్వసిస్తుంటారు. గ్రహాల అనుగ్రహాన్ని ఆశించే పూర్వీకులు ఏయే రోజుల్లో ఏయే నగలు ధరించాలనేది తమ తరువాత తరాల వారికి ఆచారాల పేరుతో అందజేశారని చెప్పొచ్చు.