ముక్కుపుడక

ముక్కుపుడక
స్త్రీ సౌందర్యం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు కనుముక్కుతీరు చాలా బాగుందని చెప్పుకుంటూ వుంటారు. స్త్రీ సౌందర్యంలో 'ముక్కు' ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ కారణంగానే ఎంతో మంది కవులు ముక్కును ఎన్నో రకాలుగా వర్ణిస్తూ పాటలు ... పద్యాలు రాశారు. ఇక పెళ్లి చూపులు చూసిన అబ్బాయిలు ''ముక్కు చాలా బావుంది ... ముక్కెరకే అందం తెచ్చేలా వుంది''అని అప్పట్లో చెప్పుకునే వారు.

అప్పట్లో ప్రతి యువతీ ముక్కెర ధరించడమనేది ఒక ఆచారంగా వచ్చింది. ఈ క్రమంలో అడ్డబేసరి కూడా ఎక్కువగానే ధరించేవారు. అయితే ఈ ముక్కెర అనేది అతివల అందం పెంచడానికే కాదు ... వారి ఆరోగ్యాన్ని కాపాడే అలంకారమని శాస్త్రం చెబుతోంది. ఎడమ శ్వాసను 'చంద్ర స్వరం' అనీ ... కుడి శ్వాసను 'సూర్య స్వరం'అని అంటుంటారు. అందువలన ముక్కుకు ఎడమ వైపున అర్థ చంద్రాకారంలోని బేసరి ... కుడి వైపున మండలాకారమైన ఒంటి రాయి బేసరి ధరించాలని శాస్త్రం చెబుతోంది.

సాధారణంగా స్త్రీలు ఇంటికి సంబంధించిన అనేక పనులను చేస్తుంటారు. ఆ కారణంగా వారికి ఎలాంటి శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా ఈ అడ్డబేసరి అడ్డుకుంటుందని చెప్పబడింది. ఈ కారణంగానే ఆనాటి పెద్దలు స్త్రీలు తప్పని సరిగా అడ్డబేసరి ధరించాలనే నియమం చేశారు. ఆధునిక కాలంలో అడ్డబేసరి స్థానంలో ముక్కుపుడక వచ్చినప్పటికీ, ఆచారంగా దీనిని ధరించడం వెనకున్న అర్థం ఇదే.

More Bhakti Articles