సప్తపది

సప్తపది
వివాహ వ్యవస్థ మన సంస్కృతీ సంప్రదాయాలను పోషించడంలో ప్రధాన పాత్రను వహిస్తోంది. వివాహమనే తంతులో 'సప్తపది' ప్రధానమైన ఘట్టమని చెప్పొచ్చు. సప్తపది అంటే ఏడు అడుగులు అని అర్థం. పెళ్లిలో హోమం చేసిన గుండానికి ఉత్తరం వైపుగా ఏడు తమలపాకులను పరుస్తారు. కొత్త జంట ఈ తమలపాకులపై ఉత్తరం వైపుగా ఏడు అడుగులను నడవడాన్ని 'సప్తపది'అని అంటారు. ఈ కార్యక్రమం జరిగిన క్షణం నుంచి వధువు ఇంటి పేరు ... గోత్రం పేరు మారిపోతాయి.

వేదాల్లో మంత్ర బలంతో వేసే ఈ ఏడు అడుగుల్లో ... ఒక్కో అడుక్కి ఒక్కో అర్థం చెప్పబడింది. 'శారీరిక బలం'కోసం మొదటి అడుగు ... 'మానసిక బలం'కోసం రెండవ అడుగు ... 'ధర్మాచారణ'కోసం మూడవ అడుగు ... 'కర్మ సంబంధమైన సుఖం' కోసం నాల్గొవ అడుగు ... 'పశు సమృద్ధి' కోసం ఐదో అడుగు ... 'రుతువులకు తగిన ఆరోగ్యం' కోసం ఆరో అడుగు ... సంసార జీవితాన్ని ఒక యజ్ఞంగా భావించమని చెప్పే 'సఖ్యత' కోసం ఏడో అడుగు వేయబడుతోంది. ఈ విధంగా నూతన వధూవరులిద్దరూ శ్రీ మహావిష్ణువును ప్రార్ధిస్తూ,తమ జీవన ప్రయాణాన్ని ఈ ఏడడుగులతో కలిసి ప్రారంభిస్తారు.

More Bhakti Articles