విచారాన్ని తొలగించే విశిష్ట క్షేత్రం
జీవితం ఎన్నో కష్ట నష్టాలకు వేదికగా కనిపిస్తూ వుంటుంది. వాటి నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరూ నిరంతరం పోరాడుతూనే ఉంటారు. తమ శక్తి చాలదనుకున్నప్పుడు ఆ భగవంతుడిపైనే భారం వేస్తుంటారు. అలాంటి భక్తుల భారాన్ని తనపై వేసుకుని, వారికి మానసిక ప్రశాంతతను కల్పించే క్షేత్రం మనకి 'కోటీశ్వరం'లో కనిపిస్తుంది. సప్త మోక్షపురాలలో ఒకటిగా విలసిల్లుతోన్న ఈ క్షేత్రం, ఉడిపి సమీపంలో దర్శనమిస్తుంది.
ఇక్కడి శివలింగం 'కోటీశ్వర లింగం'గా భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూ వుంటుంది. సువిశాలమైన ప్రాంగణంలో భారీగా కనిపించే ఈ ఆలయం, చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతూ వుంటుంది. గోపురాలు .. ప్రాకారాలు .. మంటపాలు .. స్తంభాలు ఇలా అడుగడుగునా శిల్పసౌందర్యం ఉట్టిపడుతూ వుంటుంది.
ఒకవైపున ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ, మరోవైపున అత్యద్భుతమైన శిల్పకళా దృశ్యాలను ఆవిష్కరిస్తూ ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో గల 'కోటితీర్థం' మహిమాన్వితమైనదని స్థలపురాణం చెబుతోంది. భక్తులు ఇందులో స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకుంటూ వుంటారు.
ఈ విధంగా చేయడం వలన, విచారానికి కారణమయ్యే కష్టనష్టాలు ... అనారోగ్యాలు తొలగించబడతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే ... ఇక్కడంత ఎత్తున్న ధ్వజస్తంభం ఈ ప్రాంతంలో మరెక్కడా కనిపించదు. అంత ఎత్తున్న ధ్వజస్తంభం చూడటం ఒక చిత్రమైన అనుభూతిని కలుగుస్తుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జరిగే ఉత్సవాలను చూసితీరవలసిందే.