దీర్ఘాయువును ప్రసాదించే క్షేత్రం
ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ... విశిష్టత ఉంటూ వుంటాయి. ఈ కారణంగానే ఆయా క్షేత్రాలకి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వుంటుంది. సాధారణంగా పుణ్యక్షేత్రాలకి వచ్చే భక్తులు ఆయురారోగ్యాలను ప్రసాదించమని భగవంతుడిని కోరుతుంటారు. వారి కర్మ ఫలితాలను బట్టి ఆ కోరికలు నెరవేరుతూ వుంటాయి. ఈ నేపథ్యంలో ఒక క్షేత్రాన్ని దర్శించడం వలన తప్పనిసరిగా దీర్ఘాయువును పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి మహిమాన్విత క్షేత్రమే 'తిరిప్పేర్ నగర్' ... ఇది తమిళనాడు - లాల్గుడి సమీపంలో విలసిల్లుతోంది.
అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రంలో స్వామివారు 'అప్పకుడత్తాన్' పేరుతోను ... అమ్మవారు 'కమలవల్లీ తాయారు' పేరుతోను పూజలు అందుకుంటూ వుంటారు. గర్భాలయంలో స్వామివారు శేష శయ్యపై శయనిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారికి అప్పాలంటే మహా ఇష్టమట ... అందువల్లనే వాటినే ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు. ఇంద్రాది దేవతలు ... మహర్షులు ... మహారాజులు ఇక్కడి స్వామివారిని సేవించి తరించారు.
ఇక ఇక్కడే స్వామి సంకల్పంచేత ఏర్పడిన 'మృత్యు వినాశిని' తీర్థం దర్శనమిస్తుంది. అల్పాయుష్కులు సైతం ఈ తీర్థంలో స్నానం చేయడం వలన దీర్ఘాయువును పొందుతారని స్థలపురాణం చెబుతోంది. మార్కండేయుడు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్లనే దీర్ఘాయువును పొందాడట. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ తీర్థంలో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామి వెన్నవంటి మనసున్నవాడనీ .. కోరిన వరాలను కొద్ది రోజుల్లోనే అనుగ్రహిస్తూ ఉంటాడని చెబుతుంటారు. అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు.