గర్భగుడిలోని దేవుడు భక్తుడి ఇంట్లో !
గర్భాలయంలో శిలారూపంలో దర్శనమిచ్చే దేవుడికి అందరూ నమస్కరించుకుని వెళుతుంటారు. అయితే అలా శిలారూపంలో గల దేవుడే నిజ భక్తులతో మాట్లాడిన సందర్భాలు లేకపోలేదు. ఆయా భక్తులలో గల లోపాలను సరిదిద్దిన దాఖలాలు లేకపోలేదు. నామదేవుడి విషయంలోనూ ఇది మరోమారు నిరూపించబడింది.
ఒకసారి తనని దర్శించడానికి వచ్చిన నామదేవుడితో పాండురంగడు మాట్లాడతాడు. నామదేవుడులోని భక్తుడు పరిపక్వత చెందలేదనీ, జ్ఞాన సముపార్జన కోసం క్షేత్ర పర్యటన చేయమని చెబుతాడు. స్వామి ఆదేశం మేరకు నామదేవుడు అనేక క్షేత్రాలను దర్శిస్తాడు. ఎంతోమంది భక్తులను ... యోగులను కలుసుకుంటాడు. అసాధారణమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాళ్లంతా ఎలాంటి అహంకారం లేకుండా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ వుండటం ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
సాదు సత్పురుషుల నుంచి అనేక విషయాలు తెలుసుకుని, కొంతకాలం తరువాత ఆయన పండరీపురం చేరుకుంటాడు. స్వామివారి గర్భాలయం దగ్గరికి వెళ్లగానే లోపల స్వామివారి విగ్రహమే తప్ప, అక్కడ ఆయన ప్రత్యక్షంగా లేడనే విషయం అర్థమైపోతుంది. తనకి దర్శనం ఇవ్వవలసినదిగా ఆయన మనసులోనే పాండురంగడిని ప్రార్ధిస్తాడు. తాను గోరాకుంభార్ ఇంట్లో సేవకుడిగా ఉన్నాననీ, అక్కడికి వచ్చి తన దర్శనం చేసుకోమనే మాటలు నామదేవుడికి వినిపిస్తాయి.
గతంలో గోరా కుంభార్ అనే భక్తుడిని తాను చాలా తక్కువగా చూడటం ... అవహేళన చేయడం ఆయనకి గుర్తుకు వస్తుంది. సాక్షాత్తు పాండురంగడినే ఇంటికి రప్పించుకున్న గోరా కుంభార్ మహా భక్తుడనీ, అది తెలుసుకోకపోవడం తన అజ్ఞానమనే అనుకుంటాడు. తాను భక్తుడిగా పరిపక్వత సాధించలేదని స్వామి ఎందుకన్నాడో అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. స్వామివారితో పాటు గోరా కుంభార్ ను కూడా దర్శించుకోవాలనే ఆత్రుతతో ఆయన ఉన్నపళంగా అక్కడికి బయలుదేరుతాడు.