అది హనుమంతుడి ఆదేశమట !
హనుమంతుడి మందిరాలు రహదారుల పక్కన ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. ఎందుకంటే చీకట్లో ఆ దారివెంట ఒంటరిగా వెళ్లే వాళ్లు భయపడకుండా, ప్రమాదాల బారిన పడకుండా ఆయన తోడుగా ఉంటాడని విశ్వసిస్తూ వుంటారు. అందువలన ఆ దారిలో వచ్చిపోయే ప్రయాణీకులు స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లడం జరుగుతుంటుంది.
ఈ నేపథ్యంలో స్వామి దర్శనం చేసుకున్న వాళ్లు క్షేమంగా గమ్యానికి చేరుకుంటారనీ, ఆయన ఆలయం చెంత ఆగకుండా వెళ్లిన వాళ్లు ప్రమాదాల బారిన పడుతూ ఉంటారనే విశ్వాసం కూడా మనకి కొన్ని చోట్ల కనిపిస్తూ వుంటుంది. ఆ తరహా ఆలయాలుగల జాబితాలో, కృష్ణా జిల్లా మైలవరం మండలంలో గల 'బొర్రగూడెం' కనిపిస్తుంది. ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన హనుమంతుడు, మహిమాన్వితుడని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.
ఆయనని దర్శించకుండా వెళితే ఆగ్రహిస్తాడనీ, అందుకు ఎన్నో నిదర్శనాలు వున్నాయని అంటారు. ఇక తనని దర్శించడానికి వచ్చే భక్తులకు నిరంతరం మంచినీళ్లను అందిస్తూ వాళ్ల దాహం తీర్చమని ఓ భక్తుడిని స్వామివారు ఆదేశించారట. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఆ భక్తుడి కుటుంబసభ్యులు ఈ సేవను కొనసాగిస్తూనే వస్తున్నారు. భక్తులు ఇక్కడ ఆగి స్వామి వారి దర్శనం చేసుకుని ఈ మంచినీళ్లు తాగేసి వెళుతుంటారు.
స్వచ్ఛంగా ... రుచిగా ఉండే ఈ నీళ్లు తాగితే కొత్త శక్తి వచ్చినట్టుగా ఉత్సాహంగా ఉంటుందని అక్కడి వాళ్లు అంటూ వుంటారు. తన దర్శనం చేసుకున్న వారిని స్వామివారు రక్షిస్తూ వుండటం ... వారి దాహాన్ని తీర్చి కొత్త ఉత్సాహాన్ని ప్రసాదిస్తోన్న కారణంగా స్వామి మహిమాన్వితుడని నమ్మకంగా చెబుతుంటారు.