శంకర జయంతి రోజున ఏంచేయాలి ?
భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి, అడుగడుగునా భక్తిభావ సుమాలను వికసింపజేసిన అపరశంకరులు ... శ్రీ ఆదిశంకరులు. కేరళ - కాలడి గ్రామంలో ఆర్యాంబ - శివగురుడు అనే బ్రాహ్మణ దంపతులకు ఆయన 'వైశాఖ శుద్ధ పంచమి' రోజున జన్మించారు. కారణజన్ములైన శంకరాచార్యులవారు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవిందభగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.
హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన, ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ, అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు, ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు.
శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే, ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. 'కనకధార స్తవం' పఠించి ఓ పేదరాలి ఇంట్లో 'బంగారు ఉసిరికాయలు' కురిపించిన తీరు ఓ మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. తల్లిని ఎంతగా ప్రేమించాలో ... దైవాన్ని ఎంతగా ఆరాధించాలో అనే దానికి శంకరుల వారి జీవితం అద్దం పడుతుంది.
అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి. ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ, దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. ఈ విధంగా చేయడం వలన పాపాలు నశించి ... విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.