దేవుడి ఇష్టం మేరకే అలా చేస్తారట !
కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు ... అక్కడ పాటించే ఆచారవ్యవహారాలు ఆశ్చర్యపరుస్తూ వుంటాయి. అయితే ఆ ఆచారాల వెనుక గల అర్థం ఏమిటనేది తెలుసుకోవడానికి ప్రయత్నించాలే గాని, విమర్శలు చేయడానికి పూనుకోకూడదు. సాధారణంగా ప్రాంతాలను బట్టి ఆయా వంటకాల్లో రుచుల తేడా కనిపిస్తూ వుంటుంది. వంటలలో వాడే పదార్థాలలో కాస్త మార్పులు ఉంటాయేమోగానీ, ఉప్పును మాత్రం అందరూ ఉపయోగిస్తూ వుంటారు.
ఉప్పులేని ప్రతి వంట చప్పగానే వుంటుంది. ఉప్పు ... అన్నిరకాల వంటకాలకు రుచిని తీసుకువస్తుంది కనుకనే దానిని 'రుచి' అని కూడా పిలుస్తుంటారు. అలాంటి ఉప్పును తినను అని ఎవరైనా నిర్ణయించుకున్నారంటే, వాళ్లు తమకి తాముగా శిక్షను విధించుకున్నట్టుగా మిగతావాళ్లు భావిస్తారు. ఎంతో ఇష్టమైన దానిని పొందడం కోసమే తప్ప, ఉప్పు వాడనని ఎవరూ అనరని నమ్ముతుంటారు.
అన్ని పదార్థాలలో కలిసి అసలైన రుచిని అందించే ఉప్పును, భూదేవి కోసం వేంకటేశ్వరస్వామి వదులుకున్నట్టుగా 'ఉప్పిలియప్పన్' క్షేత్రం చెబుతోంది. తంజావూరు ప్రాంతానికి చెందిన ఈ ఊళ్లో మార్కండేయ మహర్షి శ్రీవేంకటేశ్వరస్వామిని పూజిస్తూ ఉండేవాడు. స్వామి అనుగ్రహం కోసం ఉప్పు తినకూడదనే ఒక కఠినమైన నియమాన్ని పాటిస్తూ ఉంటాడు. ఆయన దగ్గరే భూదేవి పెరిగి పెద్దది అవుతుంది. ఉప్పు తినకూడదు అంటూ మార్కండేయ మహర్షి పెట్టిన నియమాన్ని అంగీకరిస్తూ, భూదేవిని వేంకటేశ్వరస్వామి పెళ్లి చేసుకుంటాడు.
ఈ కారణంగానే ఈ క్షేత్రంలో వంటల్లో ఉప్పును ఉపయోగించరు. సాక్షాత్తు స్వామివారే ఉప్పులేని నైవేద్యాలు స్వీకరిస్తున్నప్పుడు, తాము ఉప్పు వాడటాన్ని స్థానికులు అపరాథంగా భావిస్తుంటారు. ప్రాచీనకాలం నుంచి ఈనాటి వరకూ ఈ ఆచారాన్ని పాటిస్తూ వుండటానికి కారణం ఈ క్షేత్రం మహిమాన్వితమైనది కావడమేనని అంటారు.