అక్షయ తృతీయ విశిష్టత
'అక్షయ తృతీయ' అనగానే అందరూ బంగారం కొనడానికి బయలుదేరుతుంటారు. బంగారానికీ ... అక్షయ తృతీయకి గల సంబంధమేమిటో తెలియకపోయినా, నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తుంటారు. 'వైశాఖ శుద్ధ తదియ' రోజునే అక్షయ తృతీయ అని అంటారు. అక్షయమైన సంపదలను ... పుణ్య ఫలాలను ప్రసాదిస్తుందనే కారణంగానే ఈ పర్వదినాన్ని అక్షయ తృతీయగా పిలుస్తుంటారు.
నగదు రూపంలో గానీ ... నగల రూపంలోగాని ఈ రోజున ఏవైతే ఇంటికి వస్తాయో, అవి అక్షయమై స్థిరంగా ఉండిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే ఈ రోజున బంగారం కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. బంగారం .. లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడింది గనుక, ఈ రోజున బంగారం రూపంలో వచ్చిన లక్ష్మీదేవి, ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుందని విశ్వసిస్తుంటారు.
అంతే కాకుండా ఈ మాసం వివాహాలకు ప్రత్యేకం కనుక, అందుకు అవసరమైన బంగారాన్ని ఈ రోజున కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తుంటారు. సాధారణంగా ఏవైనా శుభకార్యాలు ప్రారభించాలనుకున్నప్పుడు, మంచిరోజు కోసం ... మంచి సమయం కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి అక్షయ తృతీయ కన్నా మంచిరోజు లేదని చెప్పబడుతోంది. ఈ రోజున పూజా మందిరంలో గల లక్ష్మీదేవిని కొత్తగా కొన్న బంగారు ఆభరణాలతో అలంకరించి పూజించడాన్ని చాలామంది ఒక ఆనవాయతీగా పాటిస్తూ వస్తుంటారు.
కృతయుగం ఆరంభమైన రోజుగా చెప్పబడుతోన్న ఈ రోజున చేసే పితృకార్యాలు ... దైవ కార్యాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అత్యంత శుభప్రదమైనదిగా చెప్పబడుతోన్న ఈ రోజున గొడుగు ... పాదరక్షలు ... నూతన వస్త్రాలు ... శనగలు ... గోధుమలు ... పెరుగన్నం దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. అర్హులైన వారికి ఈ విధంగా దానాలు చేయడం వలన దైవానుగ్రహం లభిస్తుందనీ, సిరిసంపదలు రెట్టింపు అవుతాయని స్పష్టం చేస్తోంది.