భక్తిని పరీక్షించిన బంగారు కడియాలు !
ఓ రోజు ఉదయాన్నే పాండురంగస్వామి ఆలయం తలుపులు తీసిన అర్చకులు ఆశ్చర్యపోతారు. స్వామివారి చేతికి గల 'బంగారు కడియాలు' కనిపించకపోవడమే అందుకు కారణం. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉండటం, స్వామివారి చేతికి గల బంగారు కడియాలు మాయం కావడం వాళ్లను ఆశ్చర్యచకితులను చేస్తుంది. దాంతో వాళ్లు ఆలయ అధికారికి ఈ విషయాన్ని తెలియపరుస్తారు.
స్వామివారి బంగారు కడియాలను ఎవరో కాజేశారనీ, వాటిని తిరిగి ఇవ్వకపోతే భగవంతుడి ఆగ్రహానికి గురికావలసి ఉంటుందని దండోరా వేయిస్తారు. దాంతో ఒక వేశ్య ఆలయ అధికారిని కలిసి, తన దగ్గర గల స్వామివారి కడియాలను ఆయనకి అందజేస్తుంది. క్రితం రోజు రాత్రి పురందరదాసు తన ఇంటికి వచ్చి తనకి కానుకగా ఆ కడియాలను ఇచ్చినట్టుగా చెబుతుంది. ఆయనని అక్కడ చూసినట్టుగా కొందరు సాక్ష్యం కూడా చెబుతారు. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.
దైవ సన్నిధికి పురందరదాసును పిలిపించి ఆయనపై వచ్చి ఆరోపణ గురించి చెప్పి సంజాయిషీ అడుగుతారు. తనని ఆటపట్టించడం కోసం ఆ రంగడే అక్కడికి వెళ్లి ఉంటాడనే విషయం పురందరదాసుకు అర్థమైపోతుంది. ఇది భగవంతుడు ఆడుతున్న నాటకంగా పురందరదాసు చెప్పిన సమాధానం వాళ్లకి సంతృప్తిని కలిగించదు. కొరడాతో ఆయనని దండించడానికి సిద్ధపడతారు.
తాను నేరం చేయనట్టయితే మరోజత బంగారు కడియాలు స్వామి చేతులను అలంకరిస్తాయని అంటాడు పురందరదాసు. ఆలయ అధికారి చేతిలో అసలు కడియాలు ఉండగానే, మరో జత కడియాలను ధరించి స్వామి దర్శనమిస్తాడు. దాంతో ఆలయ అధికారులు ... పెద్దలు పురందరదాసును నిర్దోషిగా భావిస్తారు. పురందరదాసు పట్ల తొందరపాటుతో వ్యవహరించినందుకు మన్నించమని కోరుతూ ఆయన పాదాలపై పడతారు.