బాబాకి తెలియనిదంటూ ఏవుంటుంది ?
భగవంతుడు తన భక్తుల బాగోగుల గురించే నిరంతరం ఆలోచిస్తూ వుంటాడు. ఆయన దృష్టిలో అంతా సమానమే అయినా, నిరుపేదలపట్ల ... నిస్సహాయులపట్ల మరింత ప్రేమానురాగాలను చూపుతుంటాడు. బాబా కూడా అలాంటివారిపట్ల అనురాగామృతాన్ని కురిపించేవాడు. అందుకు ఉదాహరణగా మనకి ఈ సంఘటన కనిపిస్తుంది.
శిరిడీకి సమీపంలో గల గ్రామంలో ఒక వృద్ధురాలు నివసిస్తూ వుండేది. అంతా బాబాను గురించి చెప్పుకుంటూ వుంటే ఆమెకి ఆయనని చూడాలనే ఆసక్తి కలుగుతుంది. పేదరాలైన తాను బాబాకు ఏం సమర్పించాలనే విషయమై సతమతమైపోతుంది. బాబాకు పాలకోవ అంటే ఇష్టమని తెలిసి, ఒక పాలకోవ తీసుకుంటుంది. దానిని జాగ్రత్తగా కొంగున కట్టుకుని, శరీరం సహకరించకపోయినా శిరిడీ బయలుదేరుతుంది.
మార్గమధ్యంలో ఆకలి వేయడంతో ఆ పాలకోవాలో కొంచెం నోట్లో వేసుకుంటుంది. కాలినడకన నానాఅవస్థలు పడుతూ శిరిడీ చేరుకుంటుంది. అప్పటికే బాబా దర్శనం కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు అక్కడికి వస్తారు. వాళ్లు తెచ్చిన ఫలాలు ... మిఠాయిలు తీసుకోకుండా బాబా ఆలోచిస్తూ కూర్చుంటాడు. బాబా దేనినీ నైవేద్యంగా స్వీకరించకపోవడం వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అదే సమయంలో ఆ వృద్ధురాలు అక్కడికి చేరుకుంటుంది. అంతమంది భక్తుల మధ్యలో బాబా దగ్గరికి వెళ్లి, ఎంగిలి చేసిన పాలకోవ ఇవ్వడానికి ఆమెకి చిన్నతనంగా అనిపిస్తుంది. దాంతో మశీదు బయటనే ఆగిపోయి బాబా దర్శనం చేసుకుంటూ వుంటుంది. బాబా తన సహచరులను పిలిచి ఆమెను తన దగ్గరికి తీసుకురమ్మని చెబుతాడు. వాళ్లు సాయంపట్టి ఆమెను ఆయన దగ్గరికి తీసుకువస్తారు.
తన కోసం తెచ్చిన పాలకోవాను తనకి ఇవ్వకపోవడం గురించి బాబా అడగడంతో ఆమె ఆశ్చర్యపోతుంది. ఎంగిలి చేసినా ఫరవాలేదు ... తనకి ఇవ్వమని బాబా అడుగుతాడు. కళ్లు ఆనందబాష్పాలు వర్షిస్తూ వుండగా, ఆమె ఆయనకి ఆ పాలకోవ అందిస్తుంది. తాను ఎదురుచూస్తోన్న నైవేద్యం ఇప్పుడు లభించిందంటూ బాబా ఎంతో ఇష్టంగా ఆ పాలకోవ తింటాడు. బాబా గొప్పతనం గురించి వింటూ వచ్చినా ఆమె, ప్రత్యక్షంగా చూసి తన్మయత్వంతో తరించిపోతుంది. అనుగ్రహించావా తండ్రీ అంటూ ఆయన పాదాలపై వాలిపోతుంది.