అహంకారం తొలగితేనే దైవానుగ్రహం
పురందరదాసు పూర్వనామం శ్రీనివాసుడు. అందువలన ఆయనకి శ్రీవేంకటేశ్వరస్వామి అంటే ఎంతో ఇష్టం. ఒకసారి ఆయన ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటూ వుండగా, ఒక యువతి వీణ తీసుకుని అక్కడికి వస్తుంది. ఆమె వీణ వాయిస్తూ వుంటే భగవంతుడు బాలుడు రూపంలో వచ్చి నాట్యం చేస్తాడని తెలిసి పురందరదాసు ఆశ్చర్యపోతాడు.
తాను ఎన్నిమార్లు కీర్తించినా నేరుగా దర్శనమివ్వని స్వామి, ఆమె వీణ వాయించగానే ప్రసన్నుడవుతాడా? అనే సందేహం ఆయనలో కలుగుతుంది. ఆ చిత్రం చూడాలని భావించి ఆమె అనుమతి తీసుకుని అక్కడే ఉండిపోతాడు. ఆమె వీణ వాయిస్తూ వుండగా స్వామివారు బాలుడి రూపంలో వచ్చి నాట్యం చేస్తాడు. ఆ తరువాత ఆమె దగ్గర వీణ తీసుకుని దానిని వాయిస్తూ వుంటాడు.
స్వామి పరవశంతో వీణ వాయిస్తూ వుండగా, సంగీతపరమైన దోషం జరుగుతుంది. ఆ విషయాన్ని అటు స్వామిగానీ ఇటు ఆ యువతి గాని పెద్దగా పట్టించుకోరు. ఇదంతా కాస్త దూరం నుంచి గమనిస్తోన్న పురందరదాసు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. దాంతో స్వామి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. సంగీతపరమైన దోషాన్ని పట్టుకుని పురందరదాసు ఆ యువతిని విమర్శిస్తాడు.
సంగీత పరిజ్ఞానం ఉందనే అహంకారంతో స్వామి సంతోషానికి భంగం కలిగించడం అపరాథమంటూ, ఆ యువతి సరస్వతీదేవిగా తన నిజ రూపాన్ని ఆవిష్కరిస్తుంది. సాక్షాత్తు నారాయణుడు ఎదురుగా కనిపిస్తూ వుంటే దర్శించి తరించవలసిందిపోయి, సంగీతపరమైన లోపాలు వెదకడం అహంభావానికి నిదర్శనమని అంటుంది.
దాంతో ఈ లోకంలోకి వచ్చిన పురందరదాసు, తాను వాదించినది వాగ్దేవితోనని తెలిసి నివ్వెరపోతాడు. తన అజ్ఞానాన్ని మన్నించమని అమ్మవారి పాదాలపై పడతాడు. అమ్మవారిని అనేక విధాలుగా కీర్తిస్తూ ఆమెను శాంతింపజేస్తాడు. తన వలన మరోమారు అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాడు.