భక్తుడి పెళ్లి దగ్గరుండి చేసిన భగవంతుడు!
భగవంతుడు తన భక్తుల వివాహం విషయంలో జోక్యం చేసుకుని వాళ్లను ఒక ఇంటి వాళ్లను చేసిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. సాక్షాత్తు ఏడుకొండలస్వామి అమ్మవారితో సహా వచ్చి అన్నమయ్యను వివాహానికి ఒప్పించిన సంఘటన ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే సుందరమూర్తి నాయనార్ అనే భక్తుడికి పరమశివుడు దగ్గరుండి వివాహం జరిపించిన సంఘటన మనకి తమిళనాడు - 'తిరువొట్టియూర్'లో కనిపిస్తుంది.
ఇక్కడి స్వామి 'ఆదిపురీశ్వరుడు' పేరుతోను... అమ్మవారు 'వడివుడైయమ్మన్' పేరుతో పూజలు అందుకుంటూ వుంటారు. ఇక స్వామివారి ఉత్సవమూర్తిని భక్తులు 'త్యాగరాజస్వామి' గా కొలుస్తుంటారు. నాయనార్లలో ముందువరుసలో కనిపించే సుందరమూర్తి నాయనార్, కైలాసంలోని శివుడి సేవకులలో ఒకడిగా స్థలపురాణం చెబుతోంది. భూలోకంలో తన భక్తుడిగా జన్మించిన ఆయనకు రెండుమార్లు వివాహమవుతుందని శివుడు అనుగ్రహిస్తాడు.
ఈ జన్మలో ఆ విషయం నాయనార్ కి గుర్తులేకపోవడం వలన, శివుడి సమక్షంలో రెండో పెళ్లి చేసుకోవడానికి మనసొప్పక ఆలయ ప్రాంగణంలో ఓ యువతి మెడలో తాళికట్టబోతాడు. అప్పుడు గర్భాలయం నుంచి వచ్చిన శివుడు, దగ్గరుండి ఆయన వివాహాన్ని జరిపించాడని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. ప్రాచీన కాలానికి చెందిన ఈ ఆలయం, ఆనాటి వైభవానికి అద్దంపడుతూ వుంటుంది.
ఎత్తైన రాజగోపురం ... పొడవైన ప్రాకారాలు ... తీర్చి దిద్దబడిన మంటపాలు ... అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఆలయ ఘనతను అందంగా ఆవిష్కరిస్తూ వుంటాయి. సదాశివుడు ప్రత్యక్షంగా కొలువుదీరిన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.