శఠారి
పండుగలు ... పర్వదినాల్లోను, విశేషమైన పుణ్య తిథుల్లోనూ దేవాలయాలకి వెళ్లి పూజాది కార్యక్రమాలు చేయించడం జరుగుతూ వుంటుంది. ఇక దేవాలయానికి వెళ్లి పూజ చేయించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తుంటాం. ఈ సమయంలో అర్చక స్వామి భక్తుల తలపై 'శఠగోపం'పెడతాడు. ఈ శఠగోపంపై స్వామివారి పాద చిహ్నాలు వుంటాయి.
ఇక ఈ శఠగోపం ఎందుకు ఇస్తారనే విషయం చాలామందికి తెలియదు. గర్భాలయంలోకి వెళ్లే అవకాశం భక్తులకి లేదు కనుక, స్వామి పాదుకలను స్పర్శించి ఆయన ఆశీర్వాదం అందుకునే అవకాశం వాళ్లకి వుండదు. అందరికీ ఆ అవకాశం కలిగించడం కోసమే శఠగోపం ఇస్తుంటారు.
నిజానికి దైవదర్శన ఫలం శఠగోపం తీసుకున్న తరువాతనే కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు. ఇక దీనిని 'శఠారి'అని కూడా అంటూ వుంటారు. ఇది స్పర్శ మాత్రం చేతనే కామ ... క్రోధ ... మోహ .. లోభ .. మద ... మత్సరాలనబడు అంతః శత్రువులను హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.