ఇద్దరు మూలమూర్తుల ద్వారకా తిరుమల
ద్వారకా తిరుమల ... ద్వారకా మహర్షి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారం కోసం తపస్సు చేయాగా, ఆ స్వామి శ్రీ వెంకటేశ్వరుడిగా దర్శనమిచ్చిన కారణంగా ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. పవిత్రమైన గౌతమీ ... కృష్ణవేణి నదుల మధ్య భాగంలో శేషాకారంగల కొండపై ఈ క్షేత్రం అలరారుతున్నది. ఏలూరుకు 41 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడ వెలసిన వెంకటేశ్వర స్వామి పాదాలు పుట్టలోపల వుంటాయి. పుట్టలోపల స్వామివారి పాదాలను ద్వారకా మహర్షి పూజిస్తూ ఉంటాడని చెబుతుంటారు. అందువలన భక్తులకి స్వామివారి పాదాలు కనిపించాలనే ఉద్దేశంతో స్వయంభూ వెనుక పీఠం పై మరో విగ్రహమును ఆగమ శాస్త్రం ప్రాకారం ప్రతిష్టించారు.
ఇద్దరు ధృవ మూర్తులు వుండటం వలన స్వయం వ్యక్తుడైన స్వామివారికి వైశాఖ మాసంలోను ... ప్రతిష్టించబడిన స్వామివారికి ఆశ్వయుజ మాసంలోను తిరు కళ్యాణ ఉత్సవాలు జరుగుతూ వుంటాయి. ఈ ఉత్సవాల సమయంలో స్వామివారు గజ ... గరుడ ... అశ్వ ... శేష ... హంస ... హనుమంత వాహనాలపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తుంటారు. ఇక ఈ స్వామి దక్షనాభి ముఖులై ఉండటాన్ని విశేషంగా చెబుతూ వుంటారు. వైకుంఠ ధాముడు కొలువుదీరిన ఈ క్షేత్రానికి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. పెద్ద తిరుపతి వెళ్లి మొక్కులు చెల్లించలేని భక్తులు, ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతిగా భావించి ఇక్కడే మొక్కుబడులు చెల్లిస్తుంటారు.
ఇక స్వామివారి సన్నిధికి కుడి వైపున అలివేలు మంగతాయారు ... తూర్పు ముఖంగా ఆండాళ్ అమ్మవారు కొలువుదీరి కనిపిస్తారు. శుక్రవారాల్లో విశేషమైన సంఖ్యలో వచ్చే భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తుంటారు. ఇక ఈ పరిసర ప్రాంతాల్లోనే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ... రేణుకాదేవి (కుంకుళ్ళమ్మ తల్లి ) దేవాలయం ... శ్రీ వెంకటేశ్వర - జగన్నాథ స్వామి దేవాలయాలు ... సుదర్శన పుష్కరిణి ... గజ - గోశాలలు కొలువుదీరి కనిపిస్తాయి. త్రేతాయుగంలో అజమహారాజు ... ఆయన కుమారుడు దశరథ మహారాజు ... ఆయన కుమారుడు శ్రీ రామచంద్రుడు వారి వారి కాలాలో ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్టుగా స్థల పురాణం చెబుతోంది. ఎందఱో మునులు ... ఋషులు ... రాజులు ... చక్రవర్తులు ... దైవాంశ సంభూతులు దర్శించుకున్న ఈ క్షేత్రంలో అడుగు పెట్టినంత మాత్రానే సకల పాపాలు హరించి వేయబడతాయని చెబుతుంటారు. అలాంటి పుణ్య క్షేత్రాన్ని దర్శించి ... పూజించి ... పునీతం కావడంకన్నా కావలసినదేముంటుంది ?