సాష్టాంగ నమస్కారం

సాష్టాంగ నమస్కారం
దైవ దర్శనం కోసం దేవాలయానికి వెళ్లగానే ప్రధాన మూర్తి ఎదుట భక్తులు 'సాష్టాంగ నమస్కారం' చేస్తుంటారు. అలాగే ఇళ్లలో పూజలు ... వ్రతాలు చేసినప్పుడు కూడా పూజా మందిరం ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. అయితే చాలా మంది తెలియకనే గర్భగుడి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. ఈ విధమైన సాష్టాంగ నమస్కారం చేయకూడదని శాస్త్రం చెబుతోంది.

గర్భాలయానికి ఎదురుగా వుండే గరుత్మంతుడు ... హనుమంతుడు వంటి వారికి ఎదురుగా కాళ్లు ఉంచిన పాపఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి అక్కడ సాష్టాంగ నమస్కారం చేయకూడదనే నియమం వుంది. దేవాలయంలో సాష్టాంగ నమస్కారం చేయాలంటే, అది ధ్వజ స్తంభం ఎదురుగా మాత్రమే చేయాలని చెబుతోంది. అక్కడ చేసిన సాష్టాంగ నమస్కారం ఆలయంలోని అన్ని మూర్తులకు చేరుతుంది.

ఇక గుడిలో అయినా ... ఇళ్లలో అయినా స్త్రీలకు సాష్టాంగ నమస్కారం విధించబడలేదు. వాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాన్ని పాటించడం వలన అపచారానికి అవకాశం లేకుండా, పుణ్య ఫలాలను అందుకోవచ్చు.

More Bhakti Articles