మహిమలు చూపే మనసున్న అమ్మవారు
భూలోకంలో పవిత్ర ప్రదేశాలను ఎంచుకుని దేవతలు తమ ఇచ్ఛాశక్తితో ఆవిర్భవిస్తూ వుంటారు. మరికొన్ని ప్రదేశాల్లో మహర్షుల కోరికమేరకు వెలుస్తుంటారు. ఇక ఒక్కోసారి మానవజన్మను ధరించి, ఆ తరువాత దైవత్వాన్ని పొంది గ్రామదేవతగా పూజలు అందుకుంటూ వుంటారు. అలా ఓ యువతి సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, చిత్రమైన పరిస్థితుల్లో మానవ దేహాన్ని వదిలి దైవాత్వాన్ని పొందిన క్షేత్రం గుంటూరు జిల్లా అడిగొప్పుల గ్రామం సమీపంలో విలసిల్లుతోంది.
ఒకప్పుడు ఇక్కడ వున్న నిదానంపాడు గ్రామం పేరుతో ఇక్కడి అమ్మవారిని నిదానంపాడు అమ్మవారుగా భక్తులు పిలుచుకుంటూ వుంటారు. ఇక్కడ ఈ క్షేత్రం ఆవిర్భవించడానికి కారణం 12వ శతాబ్దం మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటనగా స్థలపురాణం చెబుతోంది. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన రైతు కుటుంబంలో జన్మించిన శ్రీలక్ష్మి, బాల్యంలోనే మిగతా పిల్లలకు భిన్నంగా ప్రవర్తించేదట.
ఒకసారి ఆ అమ్మాయి తలపై నాగుపాము పడగవిప్పి ఆడటం చూసిన గ్రామస్తులకు ఆమె సాధారణమైన యువతికాదనే విషయం అర్థమైపోతుంది. యవ్వనంలోకి అడుగుపెట్టిన శ్రీలక్ష్మి విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అపార్థం చేసుకున్న సోదరులే ఆమెను అంతం చేస్తారు. ఆ తరువాత నిజానిజాలు తెలుసుకుని పశ్చాత్తాపపడతారు.
అయితే ఛాయామాత్రంగా గ్రామస్తులకు కనిపించిన లక్ష్మి, ఇకపై తనని గ్రామదేవతగా భావిస్తూ పూజించమనీ, సకల శుభాలను పొందమని చెప్పి అదృశ్యమైందట. కారణజన్మురాలైన ఆమెకి ఆ స్థానంలోనే పీఠాన్ని ఏర్పాటుచేసి ఆమె పాదుకలను భక్తులు పూజిస్తూ వస్తున్నారు. ఇక ఆమె జీవితంలో నాగుపాము ... ఆవు ప్రధానంగా కనిపిస్తాయి గనుక, ఆవు విగ్రహం ... నాగుపాము పుట్ట ఇక్కడ దర్శనమిస్తుంటాయి. ఆమెతో పాటే పూజలు అందుకుంటూ వుంటాయి.
ఆలయ ప్రాంగణంలో శ్రీలక్ష్మీ తల్లిదండ్రుల ప్రతిమలు కూడా దర్శనమిస్తూ వుంటాయి. కష్టాల్లో ఉన్నవారిని ఇక్కడ కొలువైన శ్రీలక్ష్మీ అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుందనే విషయం అనేకమందికి అనుభవంలోకి వచ్చింది. ఈ కారణంగా ప్రతి ఆదివారం అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తమ మనసులో మాట చెప్పుకుని కానుకలు చెల్లిస్తుంటారు. మొక్కుతీర్చుకున్న భక్తులు అమ్మవారికి ఇష్టమైన పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తుంటారు.