అత్యంత శక్తిమంతమైన శివలింగాలు
భారతదేశంలో పుణ్యక్షేత్రాల ప్రాభవం తగ్గుతున్న సమయంలో, ఆధ్యాత్మిక చింతన అడుగంటుతోన్న సమయంలో ఆదిశంకరాచార్యులు రావడం జరిగింది. అప్పటి వరకూ ప్రజలను ప్రభావితంచేస్తూ వచ్చిన ఆధ్యాత్మికత, తగ్గుముఖం పట్టడానికిగల పరిస్థితులను ఆయన పరిశీలించారు. ఆధ్యాత్మికత విషయంలో పూర్వవైభవాన్ని తీసుకు రావలసిన అవసరాన్ని ఆయన గుర్తించారు.
అందుకోసం తన శిష్యులతో కలిసి అనేక క్షేత్రాలను దర్శిస్తూ, అక్కడి పూజా విధానాల్లో సంస్కరణలు చేపడుతూ ముందుకుసాగారు. పుణ్యక్షేత్రాల పూర్వ వైభవానికిగాను ధనాకర్షణ ... జనాకర్షణ యంత్రాలను స్థాపించారు. ప్రజల్లో భక్తిభావాలను పెంపొందింపజేయడం కోసం అనేక ప్రదేశాల్లో శంకర మఠాలను స్థాపించారు.
ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు పరమశివుడు నుంచి శంకరాచార్యుల వారు అయిదు శివలింగాలను పొందారు. ఈ అయిదు శివలింగాలను అయిదు పవిత్రమైన ప్రదేశాల్లో ప్రతిష్ఠించడం జరిగింది. శృంగేరిలో 'భోగ లింగం'... నేపాల్ లో 'వరలింగం' ... కేదార్ లో 'ముక్తి లింగం' ... కాంచీపురంలో 'యోగలింగం' ... చిదంబరంలో 'మోక్షలింగం' ప్రతిష్ఠించడం జరిగింది.
శంకరాచార్యులవారు తెచ్చిన ఈ శివలింగాలు అత్యంత శక్తిమంతమైనవిగా ... విశిష్టమైనవిగా అలరారుతున్నాయి. ఆయా పేర్లకు తగినట్టుగానే విలసిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తున్నాయి. ఈ క్షేత్రల్లోని శివలింగాలను దర్శించడం వలన, పరమశివుడిని ప్రత్యక్షంగా సేవించిన ఫలితం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.